స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ రష్మిక అనే సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా లుక్ ఎలా ఉంటుందో చూసేయవచ్చు. ఆమె ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇందులో ఆమె శ్రీవల్లి అనే పాత్రను పోషిస్తోంది. పుష్ప లవ్ ఇంట్రస్ట్ పాత్ర ఆమెది. అడుగు లంగా, జాకెట్ తో కింద కూర్చొని ఉన్న లుక్ ఇది. చెవి పోగు సరిచేసుకుంటున్న లుక్ ఇది. ఆమె మొహంలో సంతోషం లేదు.. మొహాన బొట్టు లేదు. కింద పళ్లెంలో పూలు, చీర లాంటివి ఉన్నాయి.
పక్కన అద్దం ఉన్నా ఆమె మాత్రం అందులోకి చూడటం లేదు. పరధ్యానంగా ఉన్నట్టుంది. గ్రామీణ యువతి పాత్రలా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశలో ఉంది. ఇంకా చెప్పాలంటే అదో వంటిల్లు మాదిరిగా ఉంది. ఓ పక్క పొయ్యి మండుతోంది. ఈ సినిమా మొదటి భాగం మాత్రమే ముందు విడుదలవుతుంది. దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. పుష్పరాజ్ గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మికల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందో చూడాలి. శ్రీవల్లి ప్రేమను చూసి పుష్పరాజ్ మనసు కరిగినట్టు ట్వీట్ చేసిందామె.
ఈ సినిమాలో ఇంకా అనసూయ, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ కు ఈ మొదటి పార్ట్ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా రెండు పాటలు, కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఏపీలో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల షూటింగ్ వాయిదా పడినట్టు సమాచారం. అక్టోబరు నాటికి షూటింగ్ పూర్తయితే క్రిస్మస్ కు సినిమా విడుదల కావడం జరుగుతుంది.
Our fiercest #PushpaRaj's heart melts at the sight of his love ❤️
Meet @iamRashmika as #Srivalli 😍#SoulmateOfPushpa #PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/XTBei2377u
— Pushpa (@PushpaMovie) September 29, 2021
Must read ;- ’పుష్ప’ను ఢీకొనే భన్వర్ సింగ్ ఇతనే!











