తిరుమల శ్రీవారికి అనేక మంది భక్తులు కోట్లాది రూపాయల విరాళాలివ్వడం మనం వింటూనే ఉంటాం. కానీ తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంబాయికి చెందిన సంజయ్ సింగ్ అనే వ్యాపారి శ్రీవారికి రూ.300 కోట్ల భూరి విరాళం ప్రకటించారు. రూ.300 కోట్లతో 300 పడగల ఆసుపత్రిని ఉచితంగా నిర్మించి ఇచ్చేందుకు టీడీపీతో సంజయ్ సింగ్ ఎంవోయూ చేసుకున్నారు. త్వరలో ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
ఏడాదిలో విరాళాల వెల్లువ..
గడచిన ఏడాది కాలంలో తిరుమల శ్రీవారికి అనేక మంది భక్తులు భారీ విరాళాలు సమర్పించుకున్నారు. ఇటీవల తమిళనాడుకు చెందిన గురు కుమార్ శ్రీవారికి రూ.23 కోట్ల విరాళం అందించిన సంగతి తెలిసిందే. గురు కుమార్ టీడీపీ బోర్డు సభ్యుడుగా కూడా ఉన్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు వ్యాపారులు స్వామి వారికి రూ.14 కోట్ల విరాళం అందించారు. గత వారంలో పోస్కో అధినేత కూడా రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారికి వచ్చిన రూ.12000 కోట్ల విరాళాలను వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ప్రతి రోజూ భక్తుల నుంచి శ్రీవారికి సగటున రూ.3 కోట్ల విరాళాలు వస్తూ ఉంటాయి. టీడీపీ బడ్జెట్ రూ.2500 కోట్లు దాటిపోయింది. టీడీపీ తరపున నడుస్తున్న ఆసుపత్రులు, వేద పాఠశాల నిర్వహిణకు డిపాజిట్లపై వచ్చే సొమ్మును వినియోగిస్తూ ఉంటారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న దేవాలయంగా తిరుమల శ్రీవారికి గుర్తింపు ఉంది.
Also Read : 2 గంటల 20 నిమిషాల్లోనే తిరుమల మెట్లు ఎక్కేశాడట.. !