టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్ళి.. నిజానికి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లోనే జరగాల్సింది. కరోనా కారణంగా ఓ మూడు నెలలు లేటుగా, అది కూడా లాక్ డౌన్ టైమ్ లో పరిమితులకు లోబడి జరిగింది. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో తన గాళ్ ఫ్రెండ్ షాలినీ కందుకూరి మెళ్ళో తాళికట్టి ఓ ఇంటివాడయ్యాడు నితిన్ . అప్పటి నుంచి ఈ దంపతులకు తిరుమల కొండకు వెళ్ళడం బాకీ ఉండిపోయింది. కానీ నిన్ననే ఆ మొక్కు చెల్లించుకున్నారు నితిన్ అండ్ షాలిని. తిరుమలలో ఇద్దరూ ప్రత్యేకపూజ జరిపించుకున్నారు.

ఇక నితిన్ కాలినడకన తిరుమల కొండ ఎక్కడం వార్తల్లో నిలిచింది. మొత్తం 2గంటల 20 నిమిషాల్లో నితిన్ తిరుమల మెట్లెక్కి స్వామివారిని దర్శించుకున్నాడట. ఆ సమయంలో అభిమానులు నితిన్ తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఈ విషయాన్ని నితిన్ తన ఇన్ స్టా అకౌంట్ లో తెలియజేస్తూ ఫోటో కూడా జతచేశాడు. అలాగే.. ట్విట్టర్ లో కూడా దీనికి సంబంధించిన వీడియో ను ట్యాగ్ చేశాడు. ‘2గంట 20 నిమిషాల్లో తిరుమల కొండెక్కడం విజయవంతం గా పూర్తయ్యింది.. ఓం నమో వెంకటేశాయ’ అంటూ పోస్ట్ చేశాడు నితిన్.
లాస్ట్ ఇయర్ ‘భీష్మ’ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ ‘అంధాధూన్’ రీమేక్ మూవీ లైన్ లో ఉంది. ఇంకా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ నితిన్ లైన్ లో పెట్టుకున్నాడు. మరి వీటిలో ఎన్ని సినిమాలు నితిన్ కు సక్సెస్ అందిస్తాయో చూడాలి.
Must Read ;- అఖిల్ డైరెక్టర్ తో నితిన్ మూవీ.. ఎవరా దర్శకుడు?
Om Namoo Venkateshayaa 🙏🙏 https://t.co/s3MC21NXsb
— nithiin (@actor_nithiin) January 6, 2021











