బంగార్రాజు.. ఈ సంక్రాంతికి ప్రేక్షకల ముందుకు వస్తున్న భారీ, క్రేజీ మూవీ. టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువ సమ్రాట్ నాగచైతన్యల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్. దీనికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు బంగార్రాజు థియేటర్లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే.. కరోనా కారణంగా భారీ సినిమాలు పోటీ నుంచి తప్పుకున్నా.. నాగ్ మాత్రం సంక్రాంతికి బంగార్రాజు చిత్రాన్ని రిలీజ్ చేయాల్సిందే అని పట్టుదలతో ఉన్నారు. నాగ్ నమ్మకం ఏంటి..? 50 శాతం సిటింగ్ కే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. రిలీజ్ చేయాలనే ఫిక్స్ అయ్యారు. ఏంటి అంత నమ్మకం అంటే.. ఇది పండగ సినిమా. అన్నివర్గాలకు నచ్చే సినిమా. పైగా సంక్రాంతి సీజన్ లో మూడు, నాలుగు సినిమాలు వచ్చినా జనం చూస్తారు.
అందుచేత బంగార్రాజు ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుంది అంటున్నారు. అయితే.. ఏపీలో నైట్ కర్ఫ్యూ కారణంగా…ఆ సినిమాకలెక్షన్లు దారుణంగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళనచెందారు. అయితే.. కొన్ని గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడంతో వాళ్లంతా రిలీఫ్ ఫీలయ్యారు. పద్దెనిమిదో తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కారణంగా దాదాపుగా వారం రోజుల పండుగ సెలవులను బంగార్రాజు ఏపీలో క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన బంగార్రాజు రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయం అనిపిస్తోంది.











