అక్కినేని నాగచైతన్య ఇటీవల లవ్ స్టోరీ మూవీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ.. ఇలా వరుసగా సక్సస్ సాధించి హ్యాట్రిక్ సాధించి కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థ్యాంక్యూ మూవీ చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
త్వరలో థ్యాంక్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. మరో వైపు నాగచైతన్య బంగార్రాజు మూవీలో కూడా నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న బంగార్రాజు సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. నాగచైతన్య.. నందినీరెడ్డి డైరెక్షన్ లో మూవీ చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్నదత్ నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది.
గతంలో ఈ వార్తను నాగచైతన్య ఖండించారు. నేను చెప్పే వరకు నా కొత్త సినిమాలకు సంబంధించి వచ్చిన వార్తలను నమ్మద్దు అని చెప్పారు. ఇప్పుడు మరోసారి ఈ వార్త రావడంతో దాదాపు ఖాయమని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై నాగచైతన్య త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.