సమంత.. పరిచయం అవసరం లేని పేరు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ లో ఒకరు. సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది.
అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత సమంత దూకుడు మరింత ఎక్కువ అయ్యింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు కుటుంబానికి తగినంత ప్రాధ్యానత ఇస్తూనే తనదైన శైలిలో దూసుకుపోతుంది. అంతేకాదు పెళ్లి తర్వాత సమంత సక్సెస్ రేటు కూడా పెరిగింది. ఈ మధ్య సమంత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. సమంతా ‘సాకి వరల్డ్’ పేరుతో ఫ్యాషన్ స్టోర్ ను ప్రారంభించింది. ఈ రోజు ఉదయం 9 గంటల 35 నిమిషాలకు ఈ బ్రాండ్‌ను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది సమంత.
మొన్నీమధ్య ఈ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభం సందర్భంగా తన భార్య సమంతకు నాగ చైత్యన అక్కినేని శుభాకాంక్షలు తెలిపాడు. చాల ఆనందంగా, గర్వంగా ఉంది. sa-aki.com ఇప్పుడు అందుబాటులో ఉంది” అని నాగ చైతన్య ట్విట్ చేసాడు. ఇప్పుడు మామగారు నాగార్జున వంతు వచ్చింది. సమంత ప్రారంభించిన కొత్త వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలని కోరకుంటూ.. కోడలకు బెస్ట్ విషెస్ తెలియజేసాడు. కొత్తగా మొదలుపెట్టిన ఈ వ్యాపారంలో నువ్వు తప్పక రాణిస్తావు అంటూ విషెస్ అందించాడు. ఈ సందర్భంగా తనకు బెస్ట్ విషెస్ తెలియజేసిన నాగార్జునకు థాంక్యూ మామ అంటూ రిప్లై ఇచ్చింది సమంత. ఇప్పుడు ఈ వరుస ట్విట్లు ట్విట్టర్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. కుటుంబ సభ్యులే కాకుండా సమంత అభిమానులు, సినీ ప్రముఖుల సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.











