తమిళ హీరో అజిత్.. పెద్దగా వివాదాల జోలికి పోని పెద్ద స్టార్ హీరో. తన వద్ద పని చేసే వాళ్ళను కూడా సొంత మనుషులుగా చూసుకొనే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. కారణం గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు హాజరు కాకపోవడమే. శనివారం గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు జరిగాయి. ఈ కార్యక్రమానికి తమిళ నటుడు విజయ్ హాజరు కావడం చాలా మంది హృదయాలను గెలుచుకుంది. కానీ, చాలా మంది సినీ ప్రముఖులు హాజరు కాకపోవడం బాలు అభిమానులకు కోపం తెప్పించింది అనడంలో సందేహం లేదు.
హీరో అజిత్, బాలు అంత్యక్రియలకు గైరహాజరు గురించి ఎస్పీ చరణ్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు, అతను దానిని అనవసరమైన ఇష్యూ అని కొట్టిపారేశాడు. “ఇలాంటి వ్యాఖ్యలకు నేను ఎందుకు స్పందించాలి? అజిత్ నా స్నేహితుడు. అతను నాన్నతో కూడా మంచి స్నేహంగా ఉండేవాడు. అతను నాన్న అంత్యక్రియలకు వ్యక్తిగతంగా వచ్చినా లేదా రాకపోయినా? నాతో మాట్లాడినా లేకున్నా అజిత్ మనసులో మేము ఎప్పుడూ ఉంటాము. ఇప్పుడు అజిత్ విషయం పెద్దది కాదు. నేను నాన్నను కోల్పోయాను. ప్రపంచం ఎస్పీని కోల్పోయింది. నేను, మా కుటుంబం చాల భాదలో ఉన్నాం. మమ్మల్ని కొంత కాలం వదిలేయండి అని మీడియా వారిని కోరాడు.
ఈ విషయంపై అజిత్ అభిమానులు మండిపడుతున్నారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరనే వార్త మాకు భాద కలిగిస్తుందని, కాని చాల మంది సినీ ప్రముఖులు రాకపోయిన మీడియాలో ఒక వర్గం మాత్రం తమ హీరో అజిత్ ని టార్గెట్ చేసి వార్తలు రాస్తుందని వారు వాపోతున్నారు. ఇంకొకసారి ఇలాంటి రాతలు రాస్తే చూస్తూ ఊరుకోమని హీరో అజిత్ అభిమానులు తెలిపారు. ఈ విషయంపై హీరో అజిత్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.











