హీరోగా ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ మెంబర్స్ తో క్వాలిటీ టైమ్ మెయిన్ టెయిన్ చేయడం కొందరు హీరోలకే చెల్లింది. అలాంటి వారిలో బాలయ్య చాలా ప్రత్యేకత. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన ముద్దుల మనవళ్ళను ముద్దు చేయడం మాత్రం మానరు. ఆయనకి ఇద్దరు ముద్దుగారే మనవళ్ళు. పెద్ద కుమార్తె బ్రహ్మణి, లోకేష్ దంపతుల తనయుడు దేవాన్ష్ గురించి తెలిసిందే.
ఇక రెండో కుమార్తె తేజస్వి కొడుకు పేరు ఆర్యవీర్. ఈ ఇద్దరికీ బాలకృష్ణ తాతయ్య అంటే ఎంతో ఇష్టం. ఆయనకి కూడా ఇద్దరు మనవళ్ళు అంటే ప్రాణం. వాళ్ళ అల్లరి గురించి ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. లేటెస్ట్ గా ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలకృష్ణ తన చిన్న మనవడు ఆర్యవీర్ ను ఒళ్ళో కూర్చోబెట్టుకొన్నారు. ఆర్యవీర్ చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఈ ఫోటోకి అభిమానులు మురిసిపోతున్నారు.











