నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా ఆ సినిమాకు టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. తిరిగి ఈ మధ్యనే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను ట్విట్టర్ ద్వారా తెలిపాడు కూడా. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో బాలయ్యతో పాటుగా మరో నందమూరి హీరో నటిస్తున్నాడని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. హీరో తారక రత్న.
తారక రత్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్. అతడి పాత్ర ఒక యంగ్ ఎమ్మెల్యే అని సమాచారం. పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా తెలుస్తోంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటేనే ఫాన్స్ పండుగ చేసుకుంటారు. అలాంటిది ఈ సినిమాలో మరో నందమూరి హీరో ఉన్నాడంటే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. అయినా ఈ సినిమాపై మొదటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డానికి కారణం బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ వంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే.
బోయపాటి, బాలయ్యను ఆ రెండు సినిమాల్లో చాలా పవర్ ఫుల్ గా చూపించాడు. ఇప్పుడు వీరి కలయికలో వస్తున్న మూడోవ సినిమాలో బాలయ్యను దర్శకుడు బోయపాటి ఏవిధంగా చూపిస్తాడో అని ఫాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలయ్య బాబుకు సంబంధించిన టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ టీజర్ లో బాలయ్య పంచికట్టులో మెరిసిపోయాడు. ఈ సినిమా కూడా పక్కా ఇండస్ట్రీ హిట్ కొడుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.