అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా సమావేశ మందిరంలో 23వ ‘తానా’ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, సినీ నటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు.
తన సభలో వైసీపీ నాయకులు చేరి కావాలనే టీడీపీ నాయకులని టార్గెట్ చేసి పెద్ద గొడవ చేస్తున్నారని తెలుస్తోంది.
సమావేశానికి వచ్చిన ఎన్నారైలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతా ప్రశాంతంగా సాగుతోంది అనుకునే సరికి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, అసలు అక్కడ జరుగుతుంది తన సభలనే, లేక గల్లీ కొట్లాటలు? ఇది అమెరికానా? ఆంధ్రనా? అని అక్కడున్నవాళ్లు అందరు అణూమానం వ్యక్తం చేసారు..! బాలురు చొక్కాలు పట్టుకుని పారిపోగా సతీష్ వేమన వర్గాలు వారిని కొట్టారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై, వైసీపీ ఎన్నారై సభ్యులు ఒకరితో ఒక్కరు వాగ్వాదానికి దిగారు. సమావేశానికి హాజరైన వారు వివాదాన్ని పరిష్కరించేందుకు ఎంత ప్రయత్నించినా ఇరువర్గాలు ఆగలేదు. అయితే టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ పోరు జరగడం గమనార్హం. ఈ దురదృష్టకర సంఘటనతో కార్యక్రమానికి హాజరైన పెద్దలు, ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. అమెరికా వెళ్లినా.. అంతరిక్ష యాత్రకు వెళ్లినా.. రచ్చ రచ్చ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అక్కడ జరిగిన సాధారణ గొడవని వైసీపీ లీడర్స్ బూతడం పెట్టి చూస్తున్నారు, కావాలనే వైసీపీ నాయకులు పెద్ద రచ్చ చేస్తున్నారు, అక్కడ అసలు గొడవకి దిగింది వైసీపీ వర్గానికి చెందినవాళ్ళని, వాళ్ళే కావాలని రాజకీయం చేస్తున్నారని తెలుస్తోంది, వైసీపీ కి ప్రతిదీ రాజకీయధోరణిలోనే ఆలోచిస్తోంది.
ఇదిలా ఉండగా కొందరు వైసీపీ జూనియర్ అభిమానులు అతిగా స్పందించడం, ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడం, ఎక్కడికక్కడ నినాదాలు చేయడం సర్వసాధారణమైపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న బహిరంగ సభలు, నియోజకవర్గాల పర్యటన, చివరకు యువగళం పాదయాత్ర అంటూ ఎన్టీఆర్ పేరు, జెండాలు, ఫ్లెక్సీలతో కొందరు వైసీపీ నాయకులు కావాలనే సందడి చేస్తున్నారు. దీన్ని బట్టి అర్ధమవుతుంది టీడీపీ, ఎన్టీఆర్ కి కూడా గొడవలు పెట్టాలని వైసీపీ ప్లాన్ అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రశాంతంగా జరుపుకోవాల్సిన తానా సభల్లో ఇలా జరగడం గమనార్హం. అయితే.. అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తి పేరును ఇప్పుడు అసెంబ్లీలో ఎందుకు తెస్తున్నారు..? అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా వైసీపీ నాయకులు కావాలనే చేస్తున్నారు. తన్నలు తిని పారిపోయి మల్లి టీడీపీ మీద బురద జల్లుతున్నారు వైసీపీ నాయకులు..