మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన అనూహ్యంగా రద్దయింది. నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ అనంతపురం జిల్లాలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు లోకేష్ హాజరుకావడం లేదని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి.
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం రియల్ టైం గవర్నెన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వార్ రూమ్‌లో అధికారులతో సమన్వయం చేయనున్నారు లోకేష్. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిపై రివ్యూ చేయనున్నారు.
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ఏపీ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి చెందిన వారు నేపాల్‌లో చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తే..+91 9818395787 నంబర్‌కు కాల్ చేయాలని సూచించింది. దీంతో పాటు వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది.
లోకేష్..తన అవసరమున్న ప్రతీచోట ముందు నిలుస్తున్నారు. గతంలో గల్ఫ్, అరబ్ దేశాల్లో చిక్కుకున్న వారిని సైతం ఏపీకి సురక్షితంగా తిరిగివచ్చేలా కృషి చేశారు. ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు..ముందుండి సహయ సహకారాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని..వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు











