వై.ఎస్.షర్మిల సంచలన ప్రకటన చేశారు. జగన్‌కు చెక్ పెట్టే విధంగా షర్మిల పావులు కదుపుతున్నారు. సోమవారం కర్నూలు జిల్లాలో ఉల్లి మార్కెట్‌కు రైతుల పరామర్శకు వెళ్లిన షర్మిల..తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తావించారు. వై.ఎస్.రాజారెడ్డి సమయం ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. తల్లితో పాటు రాజారెడ్డి కూడా కర్నూలు ఉల్లి మార్కెట్‌కు వచ్చారు. నిజానికి కుమారుడికి రాజకీయంగా ఉండే ప్రత్యక్ష పరిస్థితులపై అవగాహన కల్పించడానికి ఆమె తీసుకు వచ్చి ఉంటారు. తన తాత పేరు పెట్టుకున్న కుమారుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడన్న నమ్మకం షర్మిలలో కనిపించింది.
ప్రస్తుతం వైసీపీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అక్రమాస్తుల కేసు లిక్కర్ స్కామ్ కేసులో జగన్ జైలుకెళ్తే పరిస్థితి ఏమిటన్న దానికి సమాధానం లేదు. గడిచిన ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి చేయని తప్పులు లేవు. వ్యవస్థలన్నింటిని వాడుకుని నిర్వీర్యం చేశారు. కొండంత అవినీతి, లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారు. జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ గందరగోళంగా ఉంది. ఆయన జైలుకెళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ జైలుకెళితే వైసీపీ పరిస్థితి ఏంటి. షర్మిల ఇదే అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ జైలుకు వెళితే భారతి పార్టీ నడిపిస్తారు కదా అనుకోవచ్చు. కానీ ఆమెకు ప్రజామోదం ఉంటుందా అంటే అది కచ్చితంగా చెప్పలేం. ఇలాంటి సమయంలో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు రాజారెడ్డి అని షర్మిల తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దళితులు, ముస్లింలు జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటికప్పుడు NDAకు మద్దతిస్తుండడం వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. ఆ వర్గాలు సైతం ప్రత్యామ్నాయం నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాయి.
కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు షర్మిల. ఐతే గత ఎన్నికల్లో షర్మిల పెద్దగా ప్రభావం చూపలేదు. ఐతే కడప జిల్లాలో మాత్రం షర్మిల ఎఫెక్ట్ కనిపించింది. వైసీపీకి తీవ్రంగా నష్టం చేకూర్చింది. కడప జిల్లాలో కొన్ని సీట్లు వైసీపీ కోల్పోవడానికి కాంగ్రెస్ చీల్చిన ఓట్లే కారణం.మొత్తంగా షర్మిల దూరదృష్టితో ఆలోచించి..రాజారెడ్డిని రంగంలోకి తెస్తున్నారని అనుకోవచ్చు. ప్రస్తుతం పాస్టర్‌గా మారిన రాజారెడ్డి…పొలిటికల్ స్పీచ్‌లు ఇరగదీస్తే తిరుగుండదని షర్మిల భావిస్తుంది.











