లోకేష్..ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా ఉన్న పొలిటిషియన్. ఎక్కడ పోగొట్టుకున్నాడో..అక్కడే గెలిచి నిలిచిన లీడర్. పాలిటిక్స్‌లో షార్ట్‌కట్స్ ఉండవు. కేవలం ప్రజలకు చేరువకావడం ద్వారా మాత్రమే రాజకీయాల్లో విజయం సాధ్యమవుతుంది. ఆ ఒక్కటే పని చేస్తుందా అంటే కాదు. ప్రజల అభిమానాన్ని పొందడం అంత సులువైన విషయం కాదు. కుల, మత , ప్రాంత భావనల నుంచి..రాజకీయ విద్వేష వాతావరణం నుంచి ప్రజలను బయటకు తీసుకువచ్చి..మీ కోసం, మీ బాగు కోసం చేసేదే రాజకీయం అనే భావన వారిలో కలిగించాలి. ఈ పని అంత ఈజీ కాదు. కానీ నారా లోకేష్ ఈ పని చేసి చూపించారు. ఓ కేస్ స్టడీగా నిలిచారు.
2019లో ఓటమి..2024లో బంపర్ మెజార్టీ
2019 ఎన్నికల్లో 5 వేల ఓట్ల తేడాతో ఓడిన నారా లోకేష్..5 సంవత్సరాలు తిరిగేలోపు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ముగ్గురిలో ఒకరిగా నిలిచారు. ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట కూడా కాదు. ఐనప్పటికీ పట్టుబట్టి అక్కడే నిలబడి కలబడి విజయం సాధించారు. లోకేష్ పార్టీలకు అతీతంగా ఆయన మా నాయుడుకు అయితే బాగుండు అని అనిపించుకునేలా నిరూపించుకున్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఉండి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నారు. వీలైనన్ని సమస్యలు పరిష్కరించారు. అధికారంతోనే పరిష్కరించగలిగే సమస్యలకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు.
లోకేష్ అంటే ఎన్టీఆర్ మనవడు. చంద్రబాబు కుమారుడు. ఇలా కొంతమంది వారసత్వం లెక్కలు చెప్తారు. కానీ వారసత్వం రాజకీయాల్లో ఎంట్రీ కావడానికి మాత్రమే పనికివస్తుంది. తర్వాత నిలబడాలంటే సొంత శక్తి అవసరం. ఇక లోకేష్ అందుబాటులో ఉండరని, సామాన్యుల కష్టాలు ఆయనకు తెలియవని 2019లో ప్రచారం చేశారు. అందువల్లే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కానీ ఆయన ప్రజల మనిషి అని అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. గెలిచిన తర్వాత కూడా ఆయన మారలేదు. మంత్రిగా ఉన్నా..పార్టీ బాధ్యతలు చేపడుతున్నా.. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీల జాబితాను పక్కన పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
నిమ్మల…. లోకేష్
ఏపీలో ఇప్పుడు రాజకీయం ఎంత సులువో..ప్రజాభిమానం పొందడం ఎంత ఈజీనో ఇద్దరు నేతలు నిరూపిస్తున్నారు. ఒకరు నిమ్మల రామానాయుడు, మరొకరు లోకేష్. ఇద్దరిది రాజకీయాల్లో వేర్వేరు స్టైల్. కానీ ప్రజాభిమానం సంపాదించడంలో సేమ్ టు సేమ్. ఇతర ఎమ్మెల్యేలు కూడా వీరిని చూసి..ఫాలో అయిపోతే వారికి తిరుగు ఉండదు.