“యాక్ట్ ఆఫ్ పార్లమెంట్” అంటే కూడా తెలియనివారు చట్టాలు చేసే స్థానాల్లో ఉండటం రాష్ట్ర ప్రజల ఖర్మ అని విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్.పదో తరగతి ఫెయిల్ అయినవారు మంత్రులుగా , అసలు ఏం చదివారో తెలియని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండబట్టే ఆంధ్ర ప్రదేశ్ ఇలాంటి పరిస్తుతుల్లో ఉందని ఆయన ఎద్దేవా చేశారు.ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఆమోదం ఉందన్న లోకేష్..కేంద్ర చట్టాలను, కేంద్ర వ్యవస్థలను కాదని జగన్‌రెడ్డి కొత్త చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉండబట్టే కోర్టు దానిని తప్పుబట్టిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని కాదని నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. రాష్ట్రంలో కేంద్రీకృత పాలన , వికేంద్రీకృత అభివృద్ధి అనేది మొదటి నుంచి తమ నాయకుడు చంద్రబాబు విధానమని, అనంతపురంలో కియా, చిత్తూరు జిల్లా శ్రీసిటీలో సెల్‌కాన్, కర్నూలులో మెగాసీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, ఉభయగోదావరి జిల్లాల్లో మత్స్య పరిశ్రమలు, విశాఖలో అదానీ డేటా సెంటర్, హెచ్‌సీఎల్ కంపెనీ ఆ ఆలోచనలో నుంచి పురుడుపోసుకున్నవే అని లోకేష్ తెలిపారు.
జగన్ మొండి వైఖరి వల్లే ఏపీకి రావాల్సిన పెట్టుబడులు పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయని లోకేష్ మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా అని ఆయన ప్రశ్నించారు ? రాష్ట్రానికి ఆదాయం పెంచకుండా చిన్న జిల్లా చేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందో అర్ధం కావట్లేదాని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇక యువతకు ఉపాధి కల్పించడంలోనూ జగన్ సర్కార్ వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. ఇటీవలే తెలంగాణలో 10 వేల ఉద్యోగాల హామేథో 3500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒక పరిశ్రమ వచ్చిందన్న ఆయన జగన్ తన మూడేళ్ళ పాలనలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని అన్నారు.
ఇక కొత్త జిల్లాలు, కొత్త చట్టాల వల్ల జగన్‌రెడ్డికి తప్ప ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదన్న లోకేష్..కొత్త జిల్లాలతోనే అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి నమ్మితే..175 నియోజకవర్గాలను 175 జిల్లాలుగా చేయొచ్చు కదా?’’ అని ఎద్దేవా చేశారు.. వికేంద్రీకరణ అనేది ఒక అంశమే కాదన్న ఆయన,ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ మండల వ్యవస్థను ఎప్పుడో తెచ్చారని, దానికి కొనసాగింపుగా చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారని గుర్తు చేశారు.అసలు ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి రారు, అక్కడికి ప్రజలని రానివ్వడం లేదన్న లోకేష్.. వికేంద్రీకరణ జరిగితే ఎవరు ఎక్కడికి వెళ్లాలో..ఏ అధికారి ఎక్కడుండి పని చేస్తాడో..ఆ దేవుడికే తెలియాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.