సిఎం స్థాయిలో ఉండి జగన్ నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పడం బాధాకరమన్నారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కల్తీ సారా, జే బ్రాండ్లతో జగన్ రాష్ట్రంలో మహిళల తాళిబొట్లు తెంచారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీసారా మరణాల పై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎదుట శాసన సభా పక్షంతో కలిసి ఆయన నిరసన తెలిపారు. జంగారెడ్డి గూడెంలో కల్తీసారా తాగి 28 మంది చనిపోతే అవి సహజ మరణాలు అంటూ సభా వేదికగా ముఖ్యమంత్రి ప్రకటన చేయడాన్ని లోకేష్ తప్పుబట్టారు.కల్తీ సారా మరణాలపై చర్చకు తాము డిమాండ్ చేస్తుంటే తమ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.కనీసం సమావేశాల ఆఖరి రోజైనా చర్చకు ప్రభుత్వం ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక కల్తీ సారా వల్ల మృతి చెందిన వారికి నష్ట పరిహారం అందించాలన్న లోకేష్ , అవిన్నీ ప్రభుత్వ హత్యలే అని విమర్శించారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని.. ఏపీలో కల్తీ సారా, జే బ్రాండ్లు నిషేధించాలని నారా లోకేశ్ ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.
కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్…!!
ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా సరితూగని వైసీపీ... తాను అధికారంలో...