పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం మరో ట్విస్ట్ ఇచ్చింది. డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పైన ఖచ్చితంగా డీపీఆర్ తయారు చేయాల్సిందే అని కేంద్రం కొత్త నిబంధన పెట్టింది.దీంతో పాటు సామాజిక, ఆర్థిక సర్వే తాజాగా మరోసారి నిర్వహించాల్సిందేనని షరతులు విధించింది. కేంద్రం కొత్త నిబంధనలతో పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పటి వరకు పూర్తి చేస్తారో స్పష్టంగా గడువు షెడ్యూల్ చెప్పాలని కేంద్ర జలశక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిర్మాణానికి సంబందించి ప్రస్తుతానికి 15668 కోట్ల రూపాయల వరకే తమ బాధ్యత అని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది.ఇక రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2022 వరకు ప్రాజెక్టు నిర్మాణానికి 14336 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, వాటిలో 12311 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తిరిగి చెల్లించిందని స్పష్టం చేసింది. అదేసమయంలో 437 కోట్ల రూపాయలకు సంబంధించి పోలవరం ఆధారిటీ బిల్లులు పంపడం జరిగిందని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.
లోకేష్ రెడ్ బుక్‌లో కీలక పేజీ ఓపెన్….??
టీడీపీ యువనేత, మంత్రి లోకేష్.. గత కొంతకాలంగా చెబుతోన్న రెడ్ బుక్‌లోని కీలక...