Nara Lokesh Sensational Comments On Jagan Reddy
పన్నుల భారంతో వెన్ను విరిగిపోతోంది!
ఒకపక్క కరోనా .. మరోపక్క జగన్ రెడ్డి పన్నుల భారం సామాన్యుడి దైనందిన జీవితాన్ని తలకిందులకు చేస్తోంది. విద్యుత్ ఛార్జీలు,పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు ధరలు, ఇంటిపన్ను, చెత్తమీద పన్ను ఇలా అన్నీంటిపై పన్నులు పెంచుకుంటూపోతూ .. అధిక పన్నుభారాన్ని ప్రజలపై మోపి, వెన్ను విరుస్తున్నాడు. మరోపక్క ఏపిలో సహజ వనరులు లూటీకాబడ్డాయి. ఆదాయం వనరులు పూర్తిగా క్షీణించి, మదగమనంలో అభివృద్ధి కొట్టుమిట్టాడుతోంది. ఈక్రమంలో ఏదో ఒక రూపేనా ప్రజలపై భారంమోపైనా నిధులను సమీకరించాలని చూస్తున్నాడు జగన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే నేడు తెరపైకి వచ్చిన శాశ్వత గృహ హక్కు పథకం. ఎన్టీఆర్ హయంలో నుంచి ఇచ్చిన ఇళ్లకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటూ పేదల నుంచి రూ.10 వేలు కొట్టేయాలని చూస్తున్నాడని లోకేష్ ఆరోపించారు. ఎవరు కట్టద్దు.. మీకు అండగా మేం న్యాయపోరాటం చేస్తామని మంగళగిరి పర్యటనలో ఉన్న లోకేష్ ప్రజలకు భరోసా కల్పించారు.
Nara Lokesh Sensational Comments On Jagan Reddy