జగన్కు దిమ్మతిరిగే షాక్.. ఏకంగా 13మంది సర్పంచ్లు రాజీనామా!
జగన్ రెడ్డిలో మార్పు చూడాలనుకోవడం కూడా అత్యాశే అవుతోంది. ఆయనలో మార్పు అనే అంశం పక్కనపెడితే ..రోజురోజుకు ఆయనలో పెరుగుతున్న నియంతృత్వ విధానాలు, వింత పొకడలు .. నాయకులను తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. జగన్ అర్థపర్థం లేని విధానాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది ఏకంగా పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ ప్రారంభోత్సవాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డికి సొంత జిల్లా నుంచి సర్పంచ్లు ఊహించిన షాక్ ఇచ్చి .. దిమ్మ తిరిగేలా దెబ్బకొట్టారు. కడప జిల్లా మైదుకూరు నియోజకర్గంలోని ఖాజీపేట మండలంలో 13 మంది సర్పంచ్ లు వైసీపీకి గుడ్ బై చెబుతూ రాజీనామా చేశారు. అంతేకాకుండా జగన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడతామని కూడా ప్రకటించారు.
పంచాయితీలకు ఇవ్వాల్సిన నిధులే దారి మళ్లిస్తారా!
సిగ్గు.. సిగ్గు పంచాయితీలకు అందించే ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించింది. నిధులు కోసం ప్రభుత్వ ఉన్నతాధికారులకు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం మానేశారు. దీంతో చిర్రెత్తిన సర్పంచ్ లు .. మూకుమ్మడిగా రాజీనామ చేశారు. పదవులకే కాదు .. పార్టీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేయ్యడం ఆశ్చర్యం. సర్పంచ్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సొంత గడ్డపై సర్పంచులనే కాపాడుకోలేక పోయిన సీఎం .. రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి ఎమ్మెల్యేలను ఎలా రక్షించుకుంటాడో చూడాలని విమర్శలు వెల్లవెత్తున్నాయి.
సర్పంచ్ లను పిలువకుండానే ప్రారంభోత్సవాలు ..
గ్రామానికి సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. గ్రామానికి దేశాధ్యక్షుడు వచ్చిన గ్రామ సర్పంచే అధ్యక్షత వహించాలి. అటువంటి ప్రోటోకాల్ ఉన్న ప్రజాప్రతినిధి గ్రామ సర్పంచ్. అటువంటి పదవీని అధికారపార్టీ నాయకులు అడుగడుగునా అవమానిస్తున్నారు. ఖాజీపేట మండల పరిధిలోని గ్రామ పంచాయితీలకు సంబంధించి 14,15వ పంచవర్ష ప్రణాళిక సంఘం నిధులను సర్పంచ్ ల ప్రమేయం లేకుండా.. నిధులను ప్రభుత్వం డైవర్ట్ చేయడంతో మనస్తాపానికి గురయ్యారు సర్పంచ్ లు. దీంతో మూకుమ్మడిగా 13 మంది రాజీనామా చేశారు. ఈ మధ్య ‘తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం’ పై అధికారపార్టీ దాడి చేయడంపై మైదకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జబర్దస్త్ కామెంట్ చేశారు. అది మంగళగిరి కాబట్టి సరిపోయింది .. అదే సీమలో అయితే పట్టాభి మాటలకు ఇప్పటికల్లా ఖూనీలు జరిగి ఉండేది అన్నారు. మరి ఆయన సొంత నియోజకవర్గంలో సర్పంచ్ పదవులకు, పార్టీ సభ్యత్వాలకు సైతం రాజీనామా చేశారు. మరి ఇప్పుడే చేస్తారు .. ఆత్మహత్య చేసుకుంటారా? అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
Must Read ;- గ్రామ స్వరాజ్యం యాచిస్తోంది!











