Former MP Modugula Threatening Guntur Traders
మోదుగుల దాహం .. అవిరౌతున్న వ్యాపారాలు!
ఎవరి పేరు చెబితే గుంటూరు వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయో .. ఆయనే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి! అధికార పార్టీకి చెందిన ఈ నేత నేడు గుంటూరులో పొలిటికల్ మాఫియాకు తెరతీశారని వ్యాపారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో ఇప్పటికే అధికారపార్టీ నేతల అరాచకాలు మిన్నంటాయి. వీటికితోడు మోదుగుల దాష్టికాలు అంతకుమించి అనేలా ఉన్నాయని విమర్శలు లేకపోలేదు. తాజాగా ఓ ఎలక్ట్రికల్ బైక్ షోరూంపై మోదుగుల అనుచరులు చేసిన హల్చల్ నేడు గుంటూరులో హాట్ టాఫిక్లా మారింది. వ్యాపార భాగస్వాముల మధ్య వివాదాన్ని సెటిల్ చేసే ప్రయత్నంలో హరికృష్ణ అనే బిజినెస్మెన్ కు సంబంధించిన బైక్ షోరూంకు తాళాలు వేసి .. తెరిస్తే చంపుతాం అంటూ బెదిరించడం ప్రస్తుతం గుంటూరు ట్రేడ్ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది.
Former MP Modugula Threatening Guntur Traders
చేతులెత్తేసిన పోలీసులు …
గుంటూరు కు చెందిన హరికృష్ణ గతం కొంతకాలంగా నగరంలో విద్యుత్ బైక్ షోరూం నడుపుతు జీవనం సాగిస్తున్నారు. ఈ బిజినేస్ లో భాగస్వాములు మధ్య నెలకొన్న లావాదేవీలు తగువును ఎంపీ మోదుగుల డీల్ కుదిరించుకుని షోరూంపై మోదుగుల చర్యలకు పాల్పడుతున్నారని బాధితుడు హరికృష్ణ నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నాడు. మోదుగుల అనుచరులు షోరూం పై పడి తాళాలు వేశారని, రూ.25 లక్షలు ఇస్తేనే షోరూం తీయడానికి అనుమతిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసుల ఎదుట వాపోతున్నా .. మేం ఏం చేయలేమని గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పోలీసులు చెబుతున్నారని బాధితుడు అవేదన వ్యక్తం చేస్తున్నాడు.











