విద్యాశాఖ మంత్రిగా లోకేష్ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఓ మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశంలోనే సంచలనంగా మారుతున్నాయి.. ప్రతి ఒక్క రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయనే చర్చ మొదలయింది.. ఇప్పటికే పిల్లల స్కూల్ బ్యాగులు, యూనిఫామ్ విషయంలో లోకేష్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు లోకేష్. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను మూసేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ఏప్రిల్ 24 తర్వాత కాలేజీ ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
ఒక్క స్కూల్ మూసేయం – లోకేష్
రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలనూ మూసేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు మంత్రి లోకేష్. ప్రతి గ్రామంలో ఓ నమూనా పాఠశాలను ఏర్పాటు చేసి..తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తామన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామన్నారు. ఇందుకోసం అమరావతిలో ప్రపంచ స్థాయి శిక్షణ అకాడమీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఆన్‌లైన్‌లో ఉంచుతామని ప్రకటించారు.