అధికార వైసీపీ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏపీలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుత సినిమా ఏప్రిల్ 1 విడుదల అంటూ 4.30 నిమిషాల వీడియోను నారా లోకేశ్ విడుదల చేశారు. ఎన్నికల హామీల విషయంలో ప్రజలను జగన్ ఏప్రిల్ పూల్ చేశారని వీడియోలో నారా లోకేష్ పేర్కొన్నారు.జగన్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించిన తీరును ఆ వీడియోలో ఎండగట్టారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, మద్యనిషేధం వంటి హామీలతో వైసీపీ అధినేత జగన్ ప్రజలను ఏప్రిల్ పూల్ చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీ హామీలు కూడా ఏప్రిల్ పూల్ హామీలే అంటూ తన స్టైల్ లో లోకేష్ సెటైర్లు వేశారు.
సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు
కమిడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై హీరో స్థాయి కి చేరిన...