నెల్లూరులో లోకేష్ యువగళం సూపర్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది.. అయితే, ఇది ఫెయిల్ అయిందని ప్రూవ్ చేయడానికి మంత్రి కాకాణి పడుతున్నకష్టాలు అన్నీ ఇన్నీకావు.. ఎక్కడెక్కడో ఫోటోలు, జనం లేని గ్రాఫిక్స్ ఇమేజెస్, వీడియోలు జగన్ కి పంపి మార్కులుకొట్టేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఇది సొంత పార్టీలోనే నవ్వులపాలవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువ గళం పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తున్న తరుణంలో, కొందరు వైసీపీ నాయకులూ లోకేష్ పాదయాత్ర పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, అందులో వైసీపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. లోకేశ్ నిరాశకు లోనవుతున్నారని, సభల్లో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అధికార పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో టీడీపీ నాయకుడు తన రాజకీయ జీవితంపై అభద్రతా భావంలో ఉన్నారని అన్నారు
రాష్ట్రాన్ని గంజాయి వ్యాపారంతో నింపేశారని.. సైకో జగన్ కు బిల్డప్ తప్ప మరేమీ లేదన్నారు లోకేష్. దేశ చరిత్రలో 100 పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. జాబ్ క్యాలెండర్ లేదని, మెగా డీఎస్సీ లేదని చెబుతున్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. మీటర్లు ఏర్పాటు చేస్తే వ్యవసాయ మోటార్లను పగలగొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మైనార్టీలను వేధించిందన్నారు. నెల్లూరు సిటీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ సీటు రాదని, నిరాశతో మాట్లాడుతున్నారని నారా లోకేష్ విమర్శించారు.
ఇదంతా ఒకెత్తయితే కాకాని కాకమ్మ కబుర్లు ఒక ఎత్తు, నెల్లూరులో లోకేష్ పాదయత్రకి జనం రావడం లేదని, సభ ప్రాంగణాలు బోసిపోతున్నాయి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి కి అబద్దాలు చెప్తున్నారని సమాచారం,కాకాని కాకమ్మ కబుర్లు జగన్ దగ్గర పనిచేస్తయేమో కానీ ప్రజల దగ్గర పని చేయవు అని అంటున్నారు, ఉన్నది లేన్నటుగా, లేనిది ఉన్నట్టుగా సీఎం జగన్ దగ్గర చెప్పి నానా తంటాలు పడుతున్నారు తెలుస్తోంది మన కాకాని కహాని.











