ఆనందరావు, ఆయన భార్య అనురాధ గత కొన్ని రోజులుగా తరచూ గొడవ పడుతున్నారు. ఆదివారం నాడు ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సోమవారం ఓ పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడిపత్రి టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆనందరావు(52) సోమవారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత తొమ్మిది నెలలుగా తాడిపత్రి సీఐగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాడిపత్రి పట్టణంలోని సీపీఐ కాలనీలో తన అద్దె ఇంట్లో సీఐ ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధాల కారణంగానే పోలీసు అధికారి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఆనందరావు, ఆయన భార్య అనురాధ గత కొద్ది రోజులుగా తరచూ గొడవ పడుతున్నారు. ఆదివారం నాడు ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భార్య, కుమారులిద్దరూ నిద్రకు ఉపక్రమించిన అనంతరం సీఐ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పని ఒత్తిడి వల్లే తన తండ్రి ప్రాణాలు కోల్పోయాడని ఆయన కుమార్తె భవ్య ఆరోపించింది. తాను గతంలో తిరుపతి, కడపలో పనిచేశానని, అయితే ఎక్కడా ఒత్తిడికి గురికాలేదన్నారు. తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువైందని, భరించలేనని చాలాసార్లు బాధపడ్డానని భవ్య అన్నారు. అయితే ఇందులో కొందరు రాజకీయనాయకుల హస్తం ఉంది అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుని రాజకీయకోణం లో కూడా దర్యాప్తు చేస్తున్నారు, అధికారంలో ఉన్న కొందరు వైసీపీ నాయకుల వాళ్ళ సి మరణించాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.