వైసీపీ నేతలే జోకులు వేసుకుంటున్నారు.. ఎమ్‌ఎల్‌సీ ఎన్నికలు ఫలితాల తర్వాత ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో క్లియర్‌గా అర్ధం అయింది.. మరి, ఆ తర్వాత జరిగిన సర్వేలో ఇలాంటి ఫలితాలు ఎలా వస్తాయని, ఇది పెయిడ్ సర్వే అని జోకులు వేసుకుంటున్నారట..
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా ఇంకా తగ్గలేదని మరో సర్వే వెల్లడించింది. 2024 లోక్ సభ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ‘టైమ్స్ నౌ-నవ భారత్’ సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘టైమ్స్ నౌ- నవభారత్’ ‘జన్ గన్ కామన్’ పేరుతో సర్వే నిర్వహించింది. దేశంలో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. 543 సీట్లలో బీజేపీ కూటమికి 285-325 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని టైమ్స్ నౌ-నవభారత్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 111-149 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజృంభిస్తోంది. ఏపీలో 25 సీట్లు వస్తే వైసీపీకి 24-25 సీట్లు వస్తాయని అంచనా. తెలుగుదేశం పార్టీకి 0-1 సీట్లు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందన్నారు.
ఇదంతా ఒకెత్తు టీడీపీ గెలవాలి ఎందుకంటే చంద్ర బాబు గారు సీఎంగా ఉన్న సమయంలో సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు, అలాగే ఏపీకి హీరో, క్యాడ్‌బరీ, అపోలో, సెల్‌కామ్ లాంటి ఎన్నో పెట్టుబడులు తెపించారు, విశాఖను బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సిటీగా మార్చారు, CBN ద్వారా పోలవరం జెట్ స్పీడ్‌లో 67% పూర్తయింది, అన్న క్యాంటీన్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేసారు, 1500 పింఛన్లు పెంచి, 24 పథకాలు అమలు చేశారు.ప్రజలు వైసీపీకి ఓటు వేసి తప్పుడు నిర్ణయం తీసుకున్నామని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి తీరుతాం అంటున్నారు.
ఈ పేద సంక్షోభం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని మరియు ప్రజలను రక్షించడానికి CBN నేతృత్వంలోని TDP గెలవాలి అనేది ప్రజల ఆకాంక్ష, రెండవ ఆలోచన లేకుండా ఎవరు గెలవాలి అనేది ప్రశ్న కాదు. YSRCP పాలనలో ఘోరంగా విఫలమైంది. వారు చేసేది కేవలం రుణాలు తీసుకొని మొత్తం సంక్షేమానికి ఖర్చు చేయడం. రాష్ట్ర పరిస్థితిని, ప్రజల జీవితాలను ఎప్పటికీ మెరుగుపర్చని పథకాలు జగనన్న నవరత్నాలు.. రాష్ట్రంలో ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ఒక్క పరిశ్రమ కూడా ముందుకు రాకపోవడం, ప్రజలు తమ కోసమే కాకుండా రాష్ట్ర, తమ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం ఇది అని, వచ్చే ఎలెక్షన్ లో టీడీపీ కి భారీ మెజారిటీ దక్కడం ఖాయంగా కనపడుతోంది.