తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలంటే సవ లక్ష ప్రశ్నలు, షరతులు.. దీంతో విసిగిపోయిన రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.
ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చెందిన గాలి జైపాల్ అనే రైతు తాను పండించిన ధాన్యం గురించి గ్రామ వాలంటీర్ కు తెలిపాడు. వాలంటీర్ సెక్రటరీకి విషయం తెలియజేసినప్పటికీ వారు స్పందించలేదు.
ఈలోపు వర్షాలు పడడంతో రైతు తన పంటను దళారులకు పుట్టి రూ.10,100 ల చొప్పున 8 పుట్లు అమ్మాడు. వెంటనే వారు నగదు కూడా చెల్లించేసినట్లు రైతు తెలిపారు. రెండు రోజుల అనంతరం రైతు 50 పుట్లు అమ్మినట్లు పేపర్లో రావడంతో రైతు కలెక్టర్ ను ఆశ్రయించారు. ఎస్పీకి కూడా దీని గురించి విచారించమని వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.
‘మరుసటి రోజు ఉదయం తాను పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి ఎస్సై వచ్చి పోలీసు జీప్ ఎక్కమనడంతో నేను ఎందుకు అని ప్రశ్నించగా, నీ మీద కంప్లయిట్ ఉంది మాట్లాడకుండ పోలీసు వాహనం ఎక్కమని చెప్పారు. ఐదు నిమిషాల సమయం ఇవ్వండి ఎక్కుతా అంటే ఎస్సై నా చొక్కా పట్టుకుని లాగి జీపులో ఎక్కించారు’.
‘నేను కష్టపడి పని చేసుకునే రైతును, నన్ను ఒక దొంగలాగా స్టేషన్ తీసుకుని వచ్చారు’ అంటూ రైతు తన ఆవేదనను మీడియా ముందు వ్యక్తంం చేశారు.
తనతో దురుసుగా ప్రవర్తించిన ఎస్సై పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు డిమాండ్ చేస్తున్నారు. తనకి న్యాయం చేయాలంటూ రైతు అధికారులను కోరారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తన పేరుతో జరిగిన అక్రమ లావాదేవీలను వెలికితీయాలని, సూత్రధారులను బయటపెట్టాలని జిల్లా అధికారులను కోరిన దళిత రైతు జైపాల్ కు న్యాయం చేయడం మాని.. ఆయననే అదుపులోకి తీసుకున్నారు వెంకటాచలం పోలీసులు. జైపాల్ కు మద్దతుగా నిలిచారు తెలుగుదేశం నేతలు. pic.twitter.com/8hnppV193h
— Telugu Desam Party (@JaiTDP) October 22, 2020











