కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యంలో గత ఏడాది .. ప్రేక్షకులకు పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ చక్కటి వినోదాన్ని అందించాయి. అప్పటి వరకూ ఉన్న ఓటీటీలతో పాటు.. కొత్త గా కొన్ని ఓటీటీలు, ఏటీటీలు పుట్టుకొచ్చాయి. వివిధ భాషలకు చెందిన వెబ్ సిరీస్, సినిమాలు ప్రేక్షకులకు మంచి కాలక్షేపంగా మారాయి. అయితే వాటిలో కొన్ని తప్ప మిగిలినవేమీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తో పాటు ఆహా కూడా మంచి కంటెంట్ అందించడంలో సక్సెస్ అయింది. ఇంకా కొన్నింటికి ప్రారంభంలో ఆదరణ దక్కినా.. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశారు.
ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కొత్త గా ‘స్పార్క్’ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ వచ్చిచేరింది. రామ్ గోపాల్ వర్మ సహకారంతో వర్ధమాన వ్యాపార వేత్త సాగర్ మచనూరు .. ఈ ఓటీటీని అందుబాటులోకి తెస్తున్నారు. మే 15న విడుదలయ్యే ఆర్జీవీ ‘డి కంపెనీ’ మూవీతో ఈ ఓటీటీకి శ్రీకారం చుడుతున్నారు. దీనికి రెబల్ స్టార్ ప్రభాస్, అడివి శేష్ లాంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈ ఓటీటీ ఏ రేంజ్ లో ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
Rebel Star #Prabhas wishes #Sagar & @RGVzoomin, All the best for their new Venture #SparkOTT📽️ launch
Unlimited and Next Level Entertainment guaranteed
Streaming Starts from May 15thAPP Link 👉🏻 https://t.co/v2afzfBzKv
Website 👉🏻 https://t.co/1MlFFqGyrN pic.twitter.com/5UDqqymMDF— BARaju (@baraju_SuperHit) May 9, 2021