ప్రస్తుతం దేశాన్ని కోవిడ్ సెకండ్ వేవ్ పట్టి కుదిపేస్తోంది. సరైన వైద్యం అందక ఎందరో తమ ప్రాణాల్ని కోల్పోతున్నారు. పేద, ధనిక అనే బేధం లేకుండా.. అందరి మీద తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇంకా ఎందరో కోవిడ్ బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదవారికి సహాయం అందించడానికి పలువురు సెలబ్రిటీస్ రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాధేశ్యామ్ నిర్మాతలు కోవిడ్ బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు.
‘రాధేశ్యామ్’ సినిమాకి సంబంధించిన ఒక సీన్ కోసం హాస్పిటల్ సెట్ వేశారు. బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ , స్ట్రెచర్స్, తదితర మెడికల్ ఎక్విప్ మెంట్ కలిపి దాదాపు 50 సెట్ ప్రోపర్టీస్ ను 9 పెద్ద ట్రక్స్ ద్వారా హాస్పిటల్స్ కు చేర్చి కరోనా బాధితులకు సహాయం అందించారు. వీరి సహాయాన్ని ప్రశంసిస్తూ .. పలువురు సోషల్ మీడియా వేదికగా రాధేశ్యామ్ టీమ్ ను అభినందిస్తున్నారు. ఇక జూలై 30న విడుదల కావాల్సిన రాధేశ్యామ్ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేసుకుంది.
Makers of #Prabhas's #RadheShyam donated hospital set property equipment includes 50 custom beds, stretchers, PPE, medical equipment stands & oxygen cylinders to a hospital treating #COVID19 patients. pic.twitter.com/gG5B2Koos8
— BA Raju's Team (@baraju_SuperHit) May 10, 2021











