ఫ్యాంక్లీ విత్ టీఎన్ఆర్.. అంటూ ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు తుమ్మల నర్సింహరెడ్డి. నిజనిజాలకు ప్రాధాన్యమిస్తూ ఇంటర్వ్యూలు చేస్తూ.. జర్నలిజంలో కొత్త ఒరవడిని క్రియేట్ చేశాడు. యాంకర్ గానే కాకుండా.. నటుడిగానూ మెప్పించాడు. ఒక సామాన్యుడిగా వచ్చి.. జర్నలిజంలో అంచెలంచెలుగా ఎదిగాడు. అలాంటి టీఎన్ఆర్ మరణ వార్త విని టాలివుడ్ నివ్వెరపోయింది. ఆయన అభిమానులు అయితే టీఎన్ఆర్ లేడనే మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా కారణంగా తుదిశ్వాస విడిచారు. కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ఉండాలి? అనే విషయాలపై ఆయన మాట్లాడారు. ‘మంచిలో కూడా చెడును చూడాలి. కరోనా వేళ.. నేనైతే పుస్తకాలు చదువుతున్నా. ప్రాణాయామం చేసుకుంటున్న’ అంటూ చివరిగా మాట్లాడారు. కరోనాపై ఎన్నో జాగ్రత్తలు చెప్పిన వ్యక్తే.. ఇలా కన్నుమూయడం ఎంతోమందిని కలిచివేసింది. చివరగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాళ్లను తొక్కేశాడు.. నాశనం అయ్యాడు… జగన్పై ఏబీవీ సంచలన కామెంట్స్…!!
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కళ్లు...