నా ప్రాణాలకు ముప్పు కలిగినప్పుడు ఎదుటి వారిని చంపే హక్కు రాజ్యాంగం తనకు కల్పించిందన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, డీజీపీకి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డి తనపై భౌతికదాడికిదిగే అవకాశం ఉందని ఆ లేఖలో నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలని డీజీపీని కోరారు. తనను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని ఫిర్యాదు లో పేర్కొన్నారు.
వ్యాఖ్యలు బెదిరించేలా ఉన్నాయి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను బెదిరించేలా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి పై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని నిమ్మగడ్డ కోరారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు ఉద్యోగుల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని కూడా నిమ్మగడ్డ లేఖలో వివరించారు.