స్థానిక సంస్థలకు, పంచాయతీలకు ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగి తీరాల్సిందే అని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నారు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లి.. నిర్వహణ మాకు కష్టం అని నివేదించుకోగానే.. ఈసీ ప్రకటించిన షెడ్యూలును హైకోర్టు రద్దు చేసేసింది. ఇప్పట్లో ఎన్నికలు అవసరం లేదని చెప్పింది. దాని మీద ఈసీ తక్షణమే.. బెంచ్ ఎదుట మరో పిటిషన్ వేశారు. హౌస్ మోషన్ పిటిషన్ కింద తక్షణం ఈ కేసు విచారించాలని కోరారు.
అయితే నిమ్మగడ్డకు కోర్టు ఎదుట ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరమేమీ లేదని కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానానికి సంక్రాంతి సెలవులు ముగిసన తర్వాత.. 18వ తేదీన దీనిని విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.
పైగా కరోనా వాక్సిన్ వేయవలసి ఉన్న సమయంలో.. ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యం అవుతుందంటూ.. ప్రభుత్వం వినిపించిన వాదనను ఈసీ పరిగణనలోకి తీసుకోలేదంటూ.. కోర్టు పేర్కొనడం కూడా విశేషం.
Must Read ;- ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి తొలగింపు.. ఎస్‌ఈసీ సంచలన నిర్ణయం