యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని 2022 ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్టుగా కూడా ప్రకటించారు. దీని తర్వాత ఎన్టీఆర్.. కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ తో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ సంస్థ ఎన్టీఆర్ తో మూడు సినిమాలు నిర్మించింది. అందులో స్టూడెంట్ నెం.1 సక్సస్ అవ్వగా.. కంత్రి, శక్తి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.
అందుకే.. తారక్ తో ఈసారి భారీ విజయం సాధించే సినిమా తీయాలనేది వైజయంతీ మూవీస్ ప్లాన్. ఎన్టీఆర్ – తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ సెట్ చేయడానికి మూడేళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇన్నాళ్లకు ఈ క్రేజీ కాంబో ఫైనల్ కాబోతోందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అట్లీ.. షారుఖ్ ఖాన్ తో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. వైజయంతీ మూవీస్ – స్వప్న సినిమాస్ బ్యానర్ల పై ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇకపోతే వైజయంతీ బ్యానర్ లో ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ – హను రాఘవపూడి కాంబోలో యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే త్రిభాషా చిత్రం రూపొందుతోంది. అలానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కలయికలో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ చేయనున్నారు. ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ తో మూవీకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అంతా సెట్ అయిన తర్వాత ఈ భారీ చిత్రం గురించి అఫిసియల్ గా ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి.. ఈసారైనా వైజయంతీ మూవీస్ సంస్థ ఎన్టీఆర్ తో భారీ విజయాన్ని సాధిస్తందని ఆశిద్దాం.











