‘మహానటి’ తరువాత కీర్తి సురేష్ స్టార్ అయిపోయింది. ఈ సినిమాకి కీర్తి కి నేషనల్ అవార్డు కూడా రావడం తో తమిళ్, మలయాళం తో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోలు కీర్తీ డేట్స్ కోసం క్యూలు కట్టారు. కానీ మహానటి రేంజ్ సక్సెస్ కీర్తికి మళ్ళీ ఇంతవరకు రాలేదు. దానికి తోడు కీర్తీ నటించిన ప్రతి భారీ బడ్జెట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కీర్తీ తన క్రేజ్ ని మెయింటైన్ చేసుకునే పద్దితిలో తడబాట్లు పడటం మెదలు పెట్టింది. సోలో గానే తనను జనాలు ఆదరిస్తున్నారు అనే ఓవర్ కాంఫిడెన్స్ తో కీర్తీ ‘పెంగ్విన్’ అనే థ్రిల్లర్ లో నటించింది. కేవలం హై క్లాస్ ఆడియన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ పద్దతిలో రిలీజ్ చేశారు.
ఈ సినిమాని కొనుకున్న అమెజాన్ ప్రైమ్ వాడు తెగ ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి బాగా హైప్ తీసుకు వచ్చాడు. అలానే మహానటి తరువాత కీర్తి చేసిన సోలో సినిమా కావడంతో పెంగ్విన్ పై జనాలు కూడా బాగానే ఇంట్రెస్ట్ చూపించారు. ఐతే పెంగ్విన్ రిలీజ్ తరువాత చాలా బాడ్ టాక్ తెచ్చుకుంది. ఐతే కీర్తీ పై ఈ ప్రభావం చాలా పడింది. పెంగ్విన్ సినిమాకి అమెజాన్ వాడు ఎక్కువ ఇచ్చి రైట్స్ తీసుకోవడంతో ఇప్పుడు కీర్తి ని జనాలు ఓటీటీ స్టార్ హీరోయిన్ గా పిలుస్తున్నారు.
అలానే కీర్తీ అప్ కమింగ్ సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతుండటంతో కీర్తీ కెరీర్ కే నష్టం జరిగే పరిస్థితి వచ్చేసింది. డైరెక్ట్ ఓటీటీ హీరోయిన్ అని కీర్తికి పేరు పెరిగే కొద్ది తన థియేటర్ బిజినెస్ పడిపోతుంది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఉండకపోయినా కరోనా క్రైసిస్ ముగిసిన వెంటనే ఉంటుంది అని టాలీవుడ్ సినీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కొస మెరుపు ఏంటంటే ప్రస్తుతం కీర్తి హీరో నితిన్ కాంబినేషన్ లో రెడీ ఐన ‘రంగ్ దే’ సినిమాను కూడా ఓటీటీ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.