మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు ఇంట్లో సిబిఐ రైడ్. ఉదయం 8 గంటలకే సిబిఐ అధికారులు రాయపాటి ఇంటికి చేరుకున్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ విషయంలో సోదాలు నిర్వహిస్తున్న సిబిఐ. ఈ సంస్థ రుణాలు ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి రాయపాటి ఇల్లు, కార్యలయంలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సోదాలలో పలు డాక్కుమెంట్లు, ఫైల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇంతవరకు జరిగిన సోదాల్లో ఎటువంటి సమాచారం లభ్యమైనది, అధికారులు ఏమేమి స్వాధీనం చేసుకున్నారనేది ఇంకా తెలియరాలేదు.
Must Read ;- జడ్జిలపై నిందలు: మూలాలు వెతికి మరీ పట్టేసుకుంటారు











