అధికార వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపాడుతున్నాయి.ఆధిపత్య పోరు ఎక్కువై వేధింపులకు గురవుతున్న నేతలు పదవులను సైతం అక్కర్లేదంటూ ఆ పార్టీని వీడుతున్నారు.అధిస్తానం తమను పట్టించుకోవడం లేదనే ఆందోళన గతకొద్ది రోజులుగా వైకాపా నాయకుల్లో సపస్తంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న నేతలు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక పదవులను సైతం త్యగించి పక్కకు తప్పుకుంటున్నారు. తాజాగా పల్నాడులోని కరాలపాడు ఎంపీటీసీ ఎంపీపీ పదవితో పాటు ఎంపీటీసీ పదవికీ రాజీనామా చేసిన వైనం ఆ పార్టీ అధిష్టానానికి షాక్ తగిలించింది.
గురజాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పిడుగురాళ్ల మండల పరిషత్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న వైసీపీ మహిళా ఎంపీటీసీ రమణమ్మ తన ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. ఎంపీపీ పదవితో పాటు కరాలపాడు ఎంపీటీసీ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను పల్నాడు జిల్లా జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరెడ్డికి ఆమె అందజేశారు.
కరాలపాడు ఎంపీటీసీగా పోటీ చేసిన రమణమ్మ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత ఆమెను ఎంపీపీగా ఎంపిక చేసింది. కాగా ఎంపిపిగా ఉన్న తనకు ఎంపీడీఓ కార్యాలయంలో కనీసం కుర్చీ కూడా లేదనే ఆవేదన ఆమె వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి చెందిన మండల స్థాయి నేత వెంకటేశ్వర రెడ్డి అనధికారిక ఎంపీపీగా వ్యవహరిస్తూ తనను అవమానాలకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఎంపిపిగా ఉన్న తనతో సంబంధం లేకుండా అధికారిక కార్యక్రమాలను ఆయనే కానిచ్చేస్తుండడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఆమె రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.