తెలుగు సినిమా రంగంలో యూత్ హీరోల సందడి మామూలుగా లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్లంతా హీరో అవతారం ఎత్తుతున్నారు. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ సినిమా హీరో అయిన తర్వాతే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. కాకపోతే బిగ్ బాస్ వల్ల అతని క్రేజ్ మరింత పెరిగింది. సినిమా అవకాశాలు పెరిగాయి. ఇక రెండో స్థానంలో నిలిచిన అఖిల్, సౌహైల్ లు కూడా హీరోలుగా సినిమాలు ప్రారంభమయ్యాయి. మరి బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఊరికే ఎందుకుండాలి.
ఇప్పటికే గాయకుడిగా అతని క్రేజ్ అతనికి ఉంది. హీరోగా ‘చిచ్చా’ కూడా వచ్చిపడింది. ఆర్.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘మల్లిక్ కందుకూరి’ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ‘టి. హరీష్ రావు‘ సిద్దిపేట లో లాంచ్ చేసారు. రాహుల్ సిప్లిగంజ్ అతని మిత్రుడు శ్రీకాంత్ ఇద్దరు కలిసి క్రియేట్ చేసిన ‘ఊకో కాకా’ (మెన్స్ వేర్) బ్రాండ్ స్టోర్ లను విడుదల చేశారు.
మంత్రి హరీష్ రావు వీటిని ఆవిష్కరించారు. ‘చిచ్చా’ టైటిల్ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ అభిమానులు విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ బిగ్ బాస్ హీరోలందరికీ అవకాశాలు రావడానికి సినిమాల నిర్మాణం పెరగడమూ ఒక కారణమే. ఓటీటీ వచ్చాక అందరికీ ఎంతో కొంత అవకాశాలు పెరిగాయి. దానికి తోడు హీరోలు కూడా తమ సినిమాల సంఖ్యను పెంచేస్తున్నారు.
Must Read ;- అశ్లీల యాప్ లో తన ఫోటోలపై స్పందించిన పునర్నవి