పోలవరం పరిహారం పేరుతో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకు తింటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. పోలవరం పరిహారం చెల్లింపుల్లో అవినీతిని ఆయన ఆధారాలతో బయట పెట్టారు. పోలవరం నిర్వాసితుల సొమ్ము కూడా వదలకుండా ముఖ్యమంత్రి జగన్రెడ్డి సరికొత్త దోపిడీకి తెరలేపాడని పట్టాభి విమర్శించారు. నిర్వాసితులకే తెలియకుండా, ఎవరిదీ కాని భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి, ఆర్ అండ్ ఆర్ సొమ్ముని కాజేసిన వైనాన్ని ఆయన మీడియాకు వివరించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బాలరాజు,కొందరు అధికారులతో కలిసి ఈ దోపిడీకి తెరలేపాడని పట్టాభి సాక్షాలతో మీడియాకు వెల్లడించారు.మచ్చా మహాలక్ష్మీ, మదకం సావిత్రిల పేరుతో భద్రాచలం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో 13-07-2020న ఖాతాలు తెరిచి ఎవరికీ చెందని భూమి ద్వారా రెండు కోట్ల 15 లక్షల రూపాయలు కాజేశారని ఆయన వివరించారు.
సీబీఐ విచారణ జరపాలి
పోలవరం పరిహారం చెల్లింపుల్లో జరుగుతున్న అవినీతిని వెలికి తీసేందుకు తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.కేంద్ర జలశక్తి మంత్రి, సెంట్రల్ వాటర్ కమీషనర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ దోపిడీపై స్పందించాలని పట్టాభి కోరారు.ఇసుక, మద్యం, మైనింగ్ దోపిడీలతో ఆగని జగన్రెడ్డి,ఆఖరికి ఆర్ అండ్ ఆర్ సొమ్ముని కూడా దిగమింగుతున్నాడని ఆయన విమర్శించారు.సీఎం జగన్రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాకుండా ప్రజలకు చిల్లర డబ్బులేస్తూ, గిరిజనులకు చెందాల్సిన పరిహారాన్ని కూడా లూఠీ చేస్తున్నాడని పట్టాభి ధ్వజమెత్తారు.
Must Read ;- కరోనా టీకాలనూ కొనని జగన్ సర్కారు.. ధైర్యముంటే ప్రధానిని నిలదీయాలన్న పట్టాభి











