పోలవరం పర్యటనలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను నిర్వాసితులు నిలదీశారు.పరిహారం పూర్తిగా ఇవ్వకుండానే తమను ఖాళీ చేయిస్తున్నారని పైడిపాక గ్రామస్థులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎదుట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాఫర్ డ్యామ్ పూర్తి చేసి తమకు పరిహారం ఇవ్వకుంటే మునిగిపోమా.. అంటూ నిర్వాసితులు మంత్రిని ఘెరావ్ చేశారు.ఇవాళ మధ్యాహ్నం తాను అధికారులతో నిర్వహించే సమీక్ష వద్దకు రావాలంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీరియస్‌గా వెళ్లిపోయారు.దీంతో నిర్వాసితులు మంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం పనుల పురోగతి పరిశీలన
పోలవరం ప్రాజెక్టును జూన్ 2021 కల్లా పూర్తి చేసి గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తామని జలవనరుల మంత్రి అనిల్ యాదవ్ గతంలోనే ప్రకటించారు.ఇందులో భాగంగా పూర్తయిన పోలవరం కాఫర్ డ్యామ్‌ను ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం పరిశీలించారు.స్థానిక నేతలు,అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.పరిహారం విషయంలో సమావేశం అనంతరం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.