ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు ఇవాళ కన్నుమూశారు. కథా రచయిత కాళీపట్నం రామారావు మృతిపట్ల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సాహిత్యానికి తీరని లోటు అని అన్నారు. కారా మాస్టారు పేరు చెప్పగానే ఆయన రాసిన ‘యజ్ఞం’ గుర్తుకొస్తుందని చెప్పారు. సమాజంలో అట్టడుగు వర్గాలవారి బతుకు చిత్రాన్ని, జీవన సమరాన్ని ఆక్షరాల్లో చూపించారని పవన్ గుర్తుచేశారు. కారా తెలుగు సాహిత్య రంగానికి ఎంతో పాటు పడ్డారని. ఆయన ప్రతి రచనను భద్రపరిచి భవిష్యత్తు తరాలకు అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Must Read ;- ఆ గ్రామానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపండి: పవన్ కల్యాణ్











