మల్టీస్టారర్ మూవీస్ కి తాను ఏమాత్రం వ్యతిరేకిని కానని .. ఆల్రెడీ ‘గోపాలా గోపాలా’ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు పవర్ స్టార్. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు మరో మల్టీస్టారర్ తో అభిమానుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సారి ఇగో దెబ్బతిన్న పోలీసాఫీసర్ గా రానా దగ్గుబాటితో తలపడబోతున్నాడు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ మూవీకి రీమేక్ వెర్షన్ గా రూపొందుతోన్న ఈ సినిమాని సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.
ఒరిజినల్ వెర్షన్ లో బిజు మీనన్ అద్భుతంగా నటించిన మెప్పించిన పోలీస్ పాత్రకు పవన్ తన ట్రేడ్ మార్క్ స్టైల్ ను యాడ్ చేస్తుండగా.. పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన రిటైర్డ్ హవల్దార్ పాత్రలో రానా దగ్గుబాటి చెలరేగబోతున్నాడు. ఆల్రెడీ సగానికి పైగానే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ఈ దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఆల్రెడీ ఈ సమ్మర్ లో వకీల్ సాబ్ మూవీతో సూపర్ హిట్ సొంతం చేసుకున్న పవర్ స్టార్ ..ఈ సినిమాతో కూడా మంచి హిట్ అందుకుంటాడని ధీమాగా ఉన్నారు మేకర్స్. త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే , డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై .. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాతో పవర్ స్టార్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి.