పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. రీసెంట్ గా ‘వకీల్ సాబ్’ మూవీతో సక్సెస్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన సినిమాల లైనప్ అభిమానులకి భలే ఉత్సాహం కలిగిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ రీమేక్ మూవీ, హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా, అలాగే సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో సినిమా .. ఇలా ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానుల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. అయితే వీటిలో హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ వెర్షన్స్ .. సెట్స్ మీదున్నాయి. ఈ రెండింటినీ సైమల్ టేనియస్ గా కంప్లీట్ చేయాలని పవన్ ప్లాన్.
అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చిన కారణంగా.. ఆయన ఈ సినిమా షూటింగ్స్ కు తాత్కాలికంగా బ్రేకిచ్చి.. హోమ్ క్వారంటైన్ కు వెళ్ళారు. కొద్ది రోజులకు ఆయనకు నెగెటివ్ వచ్చింది. దాంతో ఆయన తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటారని అందరూ భావించారు. అయితే ఆయనకి నెగెటివ్ వచ్చినా.. ఇంకా నీరసం మాత్రం తగ్గలేదట. డాక్టర్స్ ఇంకా కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. అందుకే ప్రస్తతం పవన్ కళ్యాణ్ .. హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ మూవీస్ షూటింగ్స్ కు బ్రేకిచ్చారట.
ఈ రెండు సినిమాల్లో నటించాలంటే.. పవన్ కళ్యాణ్ కు బాడీ ఫిట్ నెస్ చాలా అవసరం. అందుండాలంటే.. శరీరానికి తగినంత శక్తి కావాలి. ఈ రెండు సినిమాల్లో ఆయన ఫైట్ సీక్వెన్సెస్ చేయాల్సి ఉంది. అందుకే తను పూర్తి స్థాయిలో కోలుకొనే వరకూ సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని డిసైడయ్యారట పవన్. ఆయన ఎప్పుడు మెంటల్ గా నూ, ఫిజికల్ గానూ ఫిట్ గా ఉండారో .. అప్పటి నుంచి ఈ రెండు సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మరి పవర్ స్టార్ ఎప్పుడు షూటింగ్స్ కు రెడీ అవుతారో చూడాలి.