ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి పరిచయమైన కథానాయికలలో పాయల్ ఒకరు. పాయల్ మంచి పొడగరి .. అదే ఆమెలోని ప్రత్యేకమైన ఆకర్షణ కూడా. ఒకప్పుడు జయప్రద .. శ్రీదేవి .. సుజాత .. సుమలత వంటి నాయికలు అభినయంతోనే కాదు, తమ హైటుతోనూ ఆకర్షణీయమైన కథానాయికలుగా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. అలా పాయల్ కూడా ‘ఆర్ ఎక్స్ 100‘ సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. భారీ అందాల భామగా మంచి మార్కులు కొట్టేసింది.
Payal Rajput :
ఈ సినిమాలో పాయల్ ను చూసినవాళ్లంతా ఊహల్లోనే ఉపవాసాలు చేశారు. చీరకట్టులో ఇంకా అందంగా కనిపించే ఈ సుందరి టాలీవుడ్ ను దున్నేయడం ఖాయమని అనుకున్నారు. బహుశా పాయల్ కూడా అదే మాట అనుకుందేమో తెలియదు. తొలినాళ్లలోనే ఆమె సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించింది. కథాకథనాలు ఏవైనా ప్రేక్షకుల చూపులన్నీ కూడా పాయల్ అందచందాలపైనే ఆగకుండా నాట్యం చేసేవి. తెరపై గోల్డ్ ఫిష్ ల తళుక్కున జారిపోయే ఆమెను చూస్తూ, విశ్రాంతి రాకుండా ఉంటే బాగుండు .. శుభం కార్డు పడకుండా ఉంటే బాగుండును అనుకున్నవారు చాలామందే ఉన్నారు.
అంతగా యూత్ హృదయాలను దోచేసిన పాయల్, కెరియర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోవాలి. కానీ అలా జరగకపోవడానికి కారణం ఆమెకి సరైన ప్లానింగ్ లేకపోవడమే అనిపించక మానదు. పాయల్ అంటే పండగే .. పాయల్ ఉంటే పండగే అని కుర్రాళ్లంతా అనుకునే సమయంలో, ఆమె సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఆ వెంటనే ఐటమ్ సాంగులో మెరిసింది. అంతేకాదు గెస్ట్ రోల్స్ కూడా కాదనలేదు. గ్లామర్ కి దూరంగా ఉండే హారర్ .. సస్పెన్స్ థ్రిల్లర్లు చేయడం మొదలుపెట్టింది. ఇలా పాయల్ వరుస పొరపాట్లను చేస్తూ వెళ్లింది. లేదంటే ఈ పాటికి స్టార్ హీరోయిన్స్ రేసులో పాయల్ ఒకరుగా నిలిచేదేమో!
Must Read ;- ‘బిగ్ బాస్ 5’ లోకి ఎంట్రీ ఇస్తోన్న హాట్ బ్యూటీ ?