మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ రాజకీయాలను ఒక మోనార్క్ తరహాలో ఏలిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు ఆయన చేసిన పాపాలే తగులుతున్నాయి. అప్పట్లో ఆయన ఎన్ని దౌర్జన్యాలు చేసినా నేతలకు ఆయన తప్ప మరో దారి ఉండేది కాదు. పవర్ లో ఉన్నప్పుడు అందర్నీ బెదిరించి తన చెప్పుచేతల్లో పెట్టుకునేవారు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో పెద్దిరెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. తన చేతిలో ఒకప్పుడు అణచివేతకు గురైన నేతలే ఇప్పుడు పెద్దిరెడ్డి మాట వినకుండా పోతున్నారు.
సొంత పార్టీ నేతల తిరుగుబాటుతో ఆయనలో పెద్దిరెడ్డిలో అంతర్మథనం ప్రారంభమైందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయాలు తీసుకోవాలని పెద్దిరెడ్డి ఆలోచనకు రాబోతున్నారని అంటున్నారు. కాలం తిరగబడినట్లుగా.. క్యాడర్ కూడా తిరగబడుతోంది. వైసీపీ అధికారం కోల్పోవడంతో పుంగనూరులో ఆ పార్టీని వీడెందుకు వైసీపీ నేతలు అందరూ రెడీ అయిపోయారు. కొంతమంది ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు.. మరికొంత మంది చేరడానికి రెడీ అవుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే కొద్ది రోజుల్లోనే పుంగనూరు వైసీపీలో పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి తప్ప.. ఇంకా ఎవరూ మిగిలే అవకాశం లేదని అంటున్నారు.
ఈ పరిస్థితి రావడానికి వైసీపీ అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించిన తీరు ఓ కారణమైతే, పెద్దిరెడ్డి అండతో అప్పట్లో రెచ్చిపోయిన క్యాడర్ ఇప్పుడు భయపడుతోంది. ఇప్పటి ప్రభుత్వం వివిధ కేసుల విషయంలో తమను వదలబోదని జంకుతోంది. అందుకే కూటమి ప్రభుత్వంలోకి పోతే కాస్త రిలీఫ్ గా ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో వైసీపీలో కొనసాగలేమని పెద్దిరెడ్డి సన్నిహిత నేతలు ఆయనకు మొహమాటం లేకుండా చెప్పి వెళ్తున్నారు. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డిపైనే కేసులు నమోదు అవుతున్నాయి. ఆయననను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
పెద్దిరెడ్డి కూడా వారిలాగానే పార్టీ జంప్ కొడదామంటే కుదరని పరిస్థితి ఉంది. టీడీపీ, జనసేనలోకి ఆయనకు దారులు ఏ మాత్రం ఉండవు. గతంలో ఆయన కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీలో చేరడానికి ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. వెళ్లకుండా పెద్దిరెడ్డి ఆ ప్రయత్నాలను నిలువరించారని అంటారు. ఆ వార్తలను అప్పట్లో మిథున్ రెడ్డి ఖండించారు కూడా. అప్పటికి, ఇప్పటికీ పరిస్థితుల్లో కొంత మార్పు చాలా కనబడుతోంది. పెద్దిరెడ్డిపై కేసులు నమోదు అవుతుండటంతో కుమారుడిని బీజేపీలోకి పంపాలని ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. తద్వారా ఆ కేసుల నుంచి ఉపశమనం పొందొచ్చని పెద్దిరెడ్డి ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు











