హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైనది. రోడ్లు జలాశయాలను తలపిస్తుంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ వాసులు మెట్రో వైపు ఆశగా చూశారు. కానీ కొన్ని వాస్తవాలు వెలుగులోకి రావడంతో హైదరాబాదీలు షాక్ తిన్నారు. భారీ వర్షాలకు మెట్రో పిల్లర్ వద్ద రోడ్డు కుంగిపోవటంతో మెట్రోపై కూడా ప్రజలు ఆశలు వదులుకోవలసి వచ్చిందని చెప్పకతప్పదు. మూసాపేటలోనే గాక మియాపూర్ లో కూడా ఇలాంటి దారుణాలు వెలుగులోకి రావడం ప్రజలను భయపెడుతున్నాయి.
వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మెట్రో పిల్లర్ చుట్టూ భూమి కుంగిపోయింది. పిల్లర్ చుట్టూ భారీ గుంత ఏర్పడటంతో మెట్రోపై కూడా హైదరాబాదీలు ఆశలు వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మెట్రో ప్రయాణమంటేనే జనాలు హడలెత్తిపోయాలా గతంలో కూడా పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పెచ్చులు ఊడిపోయి జనం చనిపోయిన ఘటన కూడా జనాల మదిలో మెలుగుతూనే ఉంది. ప్రస్తుతం పిల్లర్ చుట్టూ గుంత ఏర్పడటంతో మెట్రో మన్నికపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో మెట్రో యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రోకు ఎటువంటి ఇబ్బంది లేదని ప్రయాణం సేఫ్ అంటూ స్పష్టం చేసింది. కానీ ఈ వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు మెట్రో ప్రయాణం అంటేనే హడలెత్తే పరిస్థితులు నెలకొన్నాయనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.