ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దీ రోజులలో అమలాపురంలో పర్యటించనున్నారు. అయితే వైసీపీలో కోనసీమ జిల్లాలో వర్గపోరు నడుస్తోంది. ఒక వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ , మరో వైపు మంత్రి వేణు నువ్వా నేనా? అన్నట్టు కోల్డ్ వారు నడుస్తోంది. పిల్లి సుభాష్ మాత్రం దేనికైనా వెనకడుగు వేసేది లేదని తెల్చిపారేసాడు, ఆఖరికి వైసీపీ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనకాడను అని జగన్తో చెప్పిన్నటు సమాచారం. వేణు ,పిల్లి మధ్య గొడవ సీఎం జగన్ కి కొత్త టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది..
కోనసీమ జిల్లాలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీ టికెట్‌పై ఇద్దరి మధ్య పోరు నడుస్తోంది. సుభాష్ చంద్రబోస్ తన కుమారుడికి ఆ టికెట్ ఇవ్వాలని కోరుతుండగా.. తాను పోటీ చేస్తానని మంత్రి వేణు చెబుతున్నారు. దీంతో వీరిద్దరి పోటాపోటీ ప్రకటనలతో రాజకీయం రసవత్తరంగా మారింది.
ఈ క్రమంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో వేణుకు మద్దతిచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. మా కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేయాలని క్యాడర్ కోరుకుంటోందని, తనకు క్యాడర్ ముఖ్యమని స్పష్టం చేశారు. క్యాడర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేమని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతామన్నారు. వేణు ఆత్మీయ సమ్మేళనానికి తనకు ఆహ్వానం అందలేదని, సమయం వచ్చినప్పుడు క్యాడర్ సమాధానం చెబుతుందని పిల్లి వ్యాఖ్యానించారు.
పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. వేణుకు వైసీపీ నాయకత్వం మద్దతిస్తే పార్టీలో ఉండనని, పార్టీ ఓడిపోయినా కార్యకర్తలను వదలనని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో సంచలనంగా మారాయి. త్వరలో ఆయన పార్టీని వీడనున్నారా? అనే ప్రచారం కూడా సాగుతోంది. ఇటీవల మంత్రి వేణు, పిల్లిని అమరావతికి ఆహ్వానించి వారితో మాట్లాడారు. టికెట్ విషయంలో జగన్ నిర్ణయం తీసుకుంటారని, ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవద్దని సూచించారు. రామచంద్రాపురం టిక్కెట్టును జగన్ తన కుమారుడికి కేటాయించేలా చూడాలని పిల్లి సజ్జలకు చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే మంత్రి వేణు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల, పిల్లి వర్గం ఆధ్యాత్మిక సమ్మేళనాలను ఏర్పాటు చేసింది. దానికి పోటీగా వేణు వర్గం ఆధ్యాత్మిక సమ్మేళనాలను ఏర్పాటు చేసింది. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఇద్దరూ పోటీ పడుతున్నారు. సజ్జల మాట్లాడిన తర్వాత కూడా పిల్లి వెనక్కి తగ్గడం లేదని తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఈ నెల 26న జగన్ అమలాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేణు, పిల్లితో మాట్లాడే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కృషి చేస్తామన్నారు. మరి రామచంద్రపురం టిక్కెట్‌పై వైసీపీ క్లారిటీ ఇస్తుందా? ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదురుతుందా? లేదా? అనేది అది చూడాలి.