ఏపీలో జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. టీడీపీ యువనేత నారా లోకేశ్ మాత్రమే కాదు, ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎన్ని సీట్లు సాధిస్తుంది అనే విషయంపై ఐప్యాక్ టీమ్ సర్వేలో షాకింగ్ విషయాలు బటయపడ్డాయట. కేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని తెలుస్తోంది. జగన్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత అందరూ అనుకున్న దాని కంటే చాలా ఎక్కువగా ఉందంటూ ఐప్యాక్ తయారు చేసిన రిపోర్ట్ లీక్ అయింది. ఈ నివేదిక చూశాక జగన్‌తో కలిసి పనిచేయడం ప్రమాదకరమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం, మొదటి రోజు నుంచే ప్రజల విశ్వాసం కోల్పోతూ వచ్చింది. అధికారం మత్తులో అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు సీఎం జగన్. లక్షల కోట్లు అప్పులు చేసి, ఆ సొమ్మును జనాలకు పంచిపెడుతూ, రాష్ట్ర వనరుల అడ్డగోలు దోపిడీకి తెర తీసింది వైసీపీ సర్కారు. అధికార పార్టీ నాయకుల దోపిడీ, దౌర్జన్యాలతో వైసీపీ కార్యకర్తలే జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజల పల్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఐప్యాక్ టీమ్ చేసిన సర్వేలో.. జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రశాంత్ కిశోర్ షాక్ అయ్యారట.
హడావుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు చింపేస్తున్న జగన్, సొంత సీటుకే ముప్పు తెచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ప్రజల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్.. ఇప్పుడు పార్టీ నాయకులకూ విలన్‌గా మారారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని క్లారిటీ రావడంతో.. ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుగుబాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. సీఎం సన్నిహితుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. త్వరలోనే అనేక మంది ఎమ్మెల్యేలు ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్.
జగన్ సర్కారు విధానాలను ప్రశ్నించినా.. వైసీపీ నాయకుల అవినీతిపై విమర్శలు చేసినా.. కేసులు, అరెస్టులతో నిరసన గళాలను నొక్కిపెట్టారు తాడేపల్లి ప్యాలెస్ పాలకులు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, ఇన్నాళ్లు అధికార పార్టీ అణిచివేతకు భయపడి, మౌనంగా ఉన్న ప్రజలు తమ మనసులో మాట బయట పెడుతున్నారు. దీంతో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనే సంగతి వెలుగులోకి వచ్చింది. జగన్ అభిమాన సర్వే సంస్థ ఐప్యాక్ టీమ్ సభ్యుల ముందు కూడా ఏ మాత్రం భయం లేకుండా తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారట. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక జగన్‌కు వ్యతిరేకంగా మరిన్ని నిరసన గళాలు గొంతు విప్పడం ఖాయంగా కనిపిస్తోంది.