ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బిగ్ షాక్ తగిలింది. రాజకీయ స్ట్రాటజిస్టుగా పేరున్న ప్రశాంత్ కిషోర్ జగన్‌కి హ్యాడిచ్చారు. ఇకపై జగన్‌తో ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నిన్న విజయవాడ వచ్చిన పీకే జగన్ ఇంటికి కాకుండా తాడేపల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ పరిణామం ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్ ను ఎయిర్ పోర్టులో లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీతో టచ్ లోకి వెళ్లడంతో వైసీపీ వర్గాలు షాక్‌కు గురవుతున్నాయి.
పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేసుకుని ఆ పార్టీకి అనుకూలంగా పని చేయడానికి పీకే ఆసక్తి కనబరుస్తూంటారు. పీకే చివరి సారిగా బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ కోసం పని చేశారు. ఆ తర్వాత ఆయన ఎవరికీ స్ట్రాటజిస్టుగా పని చేయలేదు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కోసం కొన్నాళ్లు పని చేసినప్పటికీ.. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ పీకేను వద్దనుకోవడంతో తను డ్రాప్ అయినట్టు తెలిసింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి పని చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి కనబరుస్తున్నారని జాతీయ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. దీంతోపాటు ఐ ప్యాక్ తో వైసీపీ అధినేత జగన్‌కు దూరం పెరుగుతూ వచ్చింది. అయితే దీన్ని ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు నేరుగా టీడీపీ హైకమాండ్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంతో గతంలో జాతీయ మీడియాల్లో వచ్చిన వార్తలు నిజమేనని స్పష్టమైంది. ఏపీలో అధికార వైసీపీని కాదని.. టీడీపీ చెంతకు పీకే చేరడంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఏపీలో చంద్రబాబు అరెస్టు విషయంతో వైసీపీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జగన్‌పై వ్యతిరేకత పెరిగింది. అంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి వైపు కాకుండా.. బీజేపీతో సఖ్యతగా ఉండటంతో.. మైనారిటీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. పీకీ కూడా ఇండియా కూటమికి అనుకూలంగానే ఉంటున్నారు. గతంలో మమతా బెనర్జీకి స్ట్రాటజిస్టుగా వ్యవహారించారు కూడా. అలాగే కాంగ్రెస్‌కు తాను అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తాను ఇండియా కూటమి వైపే ఉండే అవకాశం ఉంది.











