జబర్దస్ట్ షో ద్వారా అందరికీ పరిచయం అయ్యి, అందరినీ కడుపుబ్బా నవ్విస్తు కమీడియన్ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు హైపర్ ఆది.కామెడీలో మసాలా రంగరించి తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ వినోదాన్ని అందిస్తూ ఆది రూటే సపరేటు. జబర్దస్ట్ లో చిన్న చిన్న క్యారెక్టర్ లతో బుల్లితెరకు పరిచయమై , అదే షో లో టీం లీడర్ స్థాయికి ఎదిగాడు ఆది.బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆది మెల్లగా వెండితెరకెక్కాడు. సర్దార్ గబ్బర్ సింగ్, మిస్టర్ మజ్ను, తొలిప్రేమ, అలా వైకుంఠపురంలో వంటి పలు చిత్రాలలో మంచి పాత్రలు పోషించి సిల్వర్ స్క్రీన్ మీద కూడా సందడి చేశాడు ఆది.
నటుడిగానే కాదు రచయితగా కూడా ఆదికి మంచి పేరుంది. జబర్దస్ట్ లో తన స్క్రిప్ట్ లు తానే రాసుకుంటాడు.ఢీ షోలో స్కిట్ లకు కూడా ఆదినే రచయితగా వ్యవహరిస్తున్నాడు. అవకాశం వస్తే సినిమాలకు కూడా రచన చేయాలని ఉందని ఆది అనేక సందర్భాలలో చెప్పారు. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పనిచేయాలనేది తన కోరిక అని ఆది పలుమార్లు బహిరంగంగానే చెప్పాడు.
జబర్దస్ట్ లో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆది, ఈటీవీలో ప్రసారమయ్యే పలు షోలలో కూడా అలరిస్తున్నారు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లలోనూ కామెడీని పండిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు ఆది. కాగా , హైపర్ ఆది అరెస్ట్ అయ్యాడానే వార్తా ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ప్రోమో అంతా కామెడీ, డ్యాన్స్ లతో సాఫీగా సాగిపోతుండగా , షోలోకి పోలీసులు సీరియస్ గా ఎంట్రీ ఇచ్చి ఫైర్ అయ్యారు.
‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్‌లోకి ప్రవేశించిన పోలీసులు, ‘ఆది ఎవరు? ఆది ఎక్కడ?’ అంటూ సీరియస్ గా అరిచారు. షూటింగ్ కి వచ్చే ముందు ఆది తన కారుతో యాక్సిడెంట్ చేసి వచ్చాడని, బాడితుడు చావుబ్రతుకుల్లో ఉన్నాడని పోలీసులు చెప్తారు. దీంతో సెట్ లోని వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆదిని పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పడంతో, పోలీసులతో వెళ్ళడానికి ఆది రెడీ అయ్యారు.ఈ క్రమంలో ‘ఆటో’ రామ్ ప్రసాద్, సెట్ లోని మిగతా వారు పోలీసులతో మాట్లాడానికి ట్రై చేస్తుంటే… ‘అతను వస్తానంటే మధ్యలో మీరు ఎవరు?’ అంటూ ఫైర్ పోలీసులు వారిపై అయ్యారు. అక్కడితో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమోకి ఎండ్ కార్డు పడింది.
అయితే ఆడీ అరెస్ట్ ఎపిసోడ్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇటువంటి ఒక సెగ్మెంట్ ను తీసుకున్నారని, పోలీసుల ఎంట్రీ, ఆడీ అరెస్ట్ అంతా అందులో భాగమే అనే కామెంట్లు పెడుతున్నారు. గత ఎపిసోడ్ లో రష్మీ గౌతమ్ స్పృహ తప్పి పడిపోయినట్టు నటించడం, ఇమ్మాన్యుయేల్ తన మీద చెయ్యి వేశాడని పూర్ణ ఫైర్ అవ్వడం వంటి స్కిట్ ల మాదిరిగానే ఆడీ అరెస్ట్ కూడా ఒక టీఆర్పీ స్కిట్ మాత్రమే అని ఇంకోదారు అభిప్రాయపడుతున్నారు. మరి ఆది నిజంగా అరెస్ట్ అయ్యాడా, లేదా అంతా అనుకుంటున్నట్లు ఇది కూడా టీఆర్పీ స్కిట్టేనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.











