టీడీపీ యువ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భేటీకి ఒక బుడ్డోడు అంతరాయం కలిగించాడు. ఈ విషయాన్ని అఖిల ప్రియ స్వయంగా తన ట్విటర్ వేదికగా తెలియజేశారు. తాను నారా లోకేష్ తో భేటీ అవ్వగా మధ్యలో బుడతడు తమ సమావేశాన్ని డిస్టర్బ్ చేశాదంటూ ఆమె పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఆ చిన్నోడు మరెవరో కాదు, అఖిల ప్రియ ముద్దుల కుమారుడే.
నారా లోకేష్ తో సమావేశంఅయ్యేందుకు వచ్చిన అఖిల ప్రియ తన కుమారుడిని తన వెంటే తీసుకువచ్చారు. అఖిలప్రియ, లోకేష్ భేటీ మధ్యలో ఆమె కుమారుడు అల్లరి చేస్తూ ఆ సమావేశాన్ని డిస్టర్బ్ చేశాడట. కాగా, ముద్దుగా అల్లరి చేస్తున్న చిన్నారిని లోకేశ్ తన చేతుల్లోకి తీసుకుని ముద్దు చేశారు. ఈ ఫొటోలను అఖిలప్రియ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.
2014 ఎన్నికలకు కొద్ది కాలం ముందు జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో భూమా అఖిలప్రియ తల్లి శోభా నాగిరెడ్డి మరణించగా.. ఆమె స్థానంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ సీటు నుంచి అఖిల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికి నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి కూడా గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలో నాగిరెడ్డి మరణానికి కాస్తంత ముందుగా ఆయనతో పాటు అఖిల ప్రియ టీడీపీలో చేరారు. అఖిలప్రియకు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కింది.
ఆ తర్వాత అఖిల ప్రియ, భార్గవ్ రామ్ ను వివాహమాడారు. వీరిద్దరికీ ఇటీవలే ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బాలుడితోనే ఇప్పుడు అఖిలప్రియ నారా లోకేశ్‌తో భేటీకి హాజరయ్యారు.ముద్దుగా కనిపించే అఖిల ప్రియ కుమారుడు తన చిలిపి అల్లరితో వారి భేటీకి అంతరాయం కలిగించాడు. ఈ క్రమంలోనే అఖిలప్రియ కుమారుడిని లోకేష్ చేతుల్లోకి తీసుకుని ముద్దు చేశారు. కాగా, అఖిల ప్రియ కుమారుడిని లోకేష్ ముద్దు చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.