లాస్టియర్ ‘భీష్మ’ తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న నితిన్ .. ఈ ఏడాది ఒక నెల తేడాతో వరుసగా ‘చెక్, రంగ్ దే’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు అతడిని నిరాశపరిచాయి. ఇక తాజా చిత్రం పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇందు నితిన్ గుడ్డివాడుగా నటిస్తుండగా.. తమన్నా ఒరిజినల్ లో టబు చేసిన కీలక పాత్రను పోషిస్తోంది. నభా నటేశ్ కథానాయికగా నటిస్తోంది.
Nithiin’s Next Movie titled as Maestro :
నితిన్ 30వ సినిమాగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమాకి ‘మాస్ట్రో’ అనే వెరైటీ టైటిల్ ఖాయం చేశారు. కథ ప్రకారం ఇందులో నితిన్ .. పియానో ప్లేయర్. అందుకే ఆ టైటిల్ సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. ‘భీష్మ’ సినిమాకి అదిరిపోయే ఆల్బమ్ నిచ్చిన.. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ మాస్ట్రో సినిమాకి సంగీతం అందించనున్నాడు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై .. సుధాకర్ రెడ్డి, ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నితిన్ పుట్టిన రోజును పురస్కరించుకొని .. మేకర్స్.. నితిన్ మాస్ట్రో పోస్టర్ ను విడుదల చేశారు. బ్లాక్ స్సెక్ట్స్ తో , స్టిక్ తో పోస్టర్ మీద బ్లైండ్ గా రివీలయ్యాడు నితిన్. ఈ పోస్టర్ ను ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు మేకర్స్. జూన్ 11న మాస్ట్రో సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Must Read ;- మళ్ళీ ‘భీష్మ’ కాంబినేషన్ .. నిజమేనా?