ఏపీలో సాగుతోన్న జగన్ సర్కార్ పాలనపై ప్రత్యర్ధులే కాదు, ఆయనకు సన్నిహితులు సైతం విరుచుకుపడుతున్నారు.. ప్రతిపక్షాలపై జగన్ సాగిస్తోన్న కక్షపూరిత వైఖరిని ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు.. గత నాలుగన్నరేళ్లలో ఏపీలో సాగిస్తోన్న పాలనపై గత నెల రోజుల్లో ఆయన అత్యంత సన్నిహితులుగా భావించే బీఆర్‌ఎస్ నేతలు పలు మార్లు ఆ పార్టీ ప్రచారం సాక్షిగా విరుచుకుపడ్డారు.. తాజాగా జగన్ పాలనపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి, ఆయనపై పలు కేసులు నమోదు చేస్తుండడంపై ప్రకాష్‌రాజ్ సీరియస్ అయ్యారు.. ఇదేం ఆలోచన అంటూ జగన్ పాలన తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు..
రాజకీయాలలో శత్రువులు ఉండకూడదని, ప్రత్యర్ధులుగా మాత్రమే చూడాలని, అధికారం మారినంతనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు ప్రకాష్ రాజ్.. గతంలో జగన్ పోరాటాన్ని, ఆయన పాలన తీరుని సమర్ధించారు విలక్షణ నటుడు.. జగన్ రెడ్డి చేసేవి హత్యా, కక్ష సాధింపు రాజకీయాలే అని తెలిసిపోతుంది కదా, ప్రతిపక్షమే లేకుండా కేవలం జగన్ రెడ్డే ఉండాలని అనుకోవడం దుర్మార్గం. చంద్రబాబు అరెస్ట్ ముమ్మాటికీ తప్పే అని ప్రకాష్ రాజ్ ఓ టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో అభిప్రాయ పడ్డారు.. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
మరోవైపు, రెండు రోజుల క్రితం.. మాజీ మంత్రి, గతంలో జగన్ కోటరీ నేతగా భావించే కొండా సురేఖ సైతం చంద్రబాబు అరెస్ట్ ని ఖండించారు.. చంద్రబాబు తలచుకుంటే జగన్ పాదయాత్ర చేసి ఉండేవాడా.? అని ఆమె ప్రశ్నించారు.. జగన్ చేస్తున్నది ముమ్మాటికీ తప్పే అని కుండబద్దలు కొట్టారు సురేఖ.. వైఎస్ మరణం తర్వాత జగన్ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నారు కొండా సురేఖ. జగన్ కోసం తీవ్రంగా పోరాడారు.. అలాంటి కొండా సురేఖ…. బాబు అరెస్ట్ అంశంలోనే కాదు, ఏపీలో జగన్ సాగిస్తోన్న అప్పుల పాలనపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఏ ఒక్క పథకమూ అమలు చేయడని అభిప్రాయపడ్డారు కొండా సురేఖ..
మొత్తమ్మీద, జగన్ పాలనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. నిన్నమొన్నటిదాకా ప్రతిపక్ష నేతలే ఆయనపై విరుచుకుపడేవారు.. తాజాగా ఇతర రాష్ట్రాల్లోని నేతలు,సెలబ్రిటీలు సైతం తప్పు పడుతున్నారు.. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండడంతో, వైసీపీకి తలనొప్పిగా మారింది..